Begin typing your search above and press return to search.

కోన‌సీమ క‌ల్లోలం వెనుక వైసీపీ నేత‌: టీడీపీ ఫైర్

By:  Tupaki Desk   |   25 May 2022 10:34 AM GMT
కోన‌సీమ క‌ల్లోలం వెనుక వైసీపీ నేత‌: టీడీపీ ఫైర్
X
అమలాపురంలో ఆందోళనలు 5 రోజులుగా జరుగుతున్నా పట్టించుకోలేదంటే.. నిన్న ఘటన ప్రభుత్వ ప్రేరేపిత కార్యక్రమం కాక మరేంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విశ్వరూప్ ఇంటిపై దాడికి ముందు ఆయన కుటుంబసభ్యుల్ని అక్కడి నుంచి తరలించారంటే దాడి జరుగుతుం దని పోలీసులకు ముందే తెలుసా? అని నిలదీశారు. ప్రశాంతమైన కోనసీమను విధ్వంసం చేయాలని జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత మూడేళ్లలో టీడీపీ ఏ కార్యక్రమం చేపట్టినా గృహనిర్బంధాలతో అణిచివేయాలని చూశారని మండిపడ్డారు. అమలాపురంలో ఆందోళనలు 5 రోజులుగా జరుగుతున్నా పట్టించుకోలేదంటే ప్రభుత్వ ప్రేరేపిత కార్యక్రమం కాక మరేంటని ప్రశ్నించారు. విశ్వరూప్ ఇంటిపై దాడికి ముందు ఆయన కుటుంబసభ్యుల్ని అక్కడి నుంచి తరలించారంటే దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసా అని నిలదీశారు. పోలీసులకు విషయం తెలిసి కూడా బందోబస్తు పెట్టలేదంటే వాళ్లని ఏమనాలని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి పదవి కోసం రాజశేఖర్రెడ్డి చావుని వాడుకోవడంతోపాటు.. బాబాయిని హత్య చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించటంలో జగన్ నేర్పరి అన్నారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు హత్య ఉదంతాన్ని మళ్లించేందు కు కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, తెలుగుదేశం నిర్వహించే మహానాడును దారి మళ్లించేందుకే అమలాపురంలో విధ్వంసం మొదలుపెట్టారని దుయ్యబట్టారు.

విధ్వంసంలో కీలకంగా వ్యవహరించిన అన్నం సాయి వైసీపీ నేతేనని పేర్కొన్నారు. ఘటనపై వాస్తవాలు స్పష్టంగా ఉంటే హోం మంత్రి టీడీపీపై నిందలు మోపటం సిగ్గుచేటన్నారు. అమలాపురం పరిధిలో గత కొద్దిరోజులుగా ఎస్ఐ, సీఐలు కూడా లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటే అంత మంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడుతోంటే అమలాపురంలో ఒక్క ఫైరింజన్ అయినా లేదా అని ప్రశ్నించారు.

వైఎస్ కుటుంబానికి ఈ తరహా ఘటనలు కొత్త కాదని ఆరోపించారు. వైఎస్ మరణం తర్వాత రిలయన్స్ షాపుల మీద దాడులు చేయించింది జగనేనని తెలిపారు. కోడి కత్తి నాటకం, వైఎస్ వివేకా హత్య కూడా జగన్ పనులేనన్నారు. బస్సు యాత్రకు వస్తున్న మంత్రులను నిలదీయడానికి దళితులు సిద్ధమవుతోన్న తరుణంలో ఈ డైవర్షన్ చేపట్టారని మండిపడ్డారు. అన్నం సాయి.. సజ్జలతో, మంత్రి విశ్వరూప్తో ఉన్న ఫొటోలను అచ్చెన్న విడుదల చేశారు.