Begin typing your search above and press return to search.
అర్దరాత్రి వేళ..ఏపీ హోంమంత్రి ఇంటి వద్ద కలకలం
By: Tupaki Desk | 9 Nov 2017 6:06 AM GMTఏపీ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ఇంటి వద్ద కలకలం చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి వేళలో చినరాజప్ప ఇంటి ఎదుట చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం చేయాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందన్నది చూస్తే..
హోంమంత్రి చినరాజప్ప ఇంటి ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా బుధవారం రాత్రి 11.30 గంటల వేళలో అకస్మాత్తుగా నిరసన నిర్వహించారు. ఇటీవల తనపై దాడి చేసిన రామచంద్రాపురం ఎస్ఐ కె.నాగరాజును సస్పెండ్ చేయాలని కోరుతూ రాజా నిరసనకు దిగారు. ఆయనతో పాటు పలువురు నిరసన బాట పట్టారు. దీంతో.. హోంమంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జగన్ పార్టీ నేతలు హోంమంత్రి ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న వేళలో ఆయన ఇంట్లో లేరు. నిరసన చోటు చేసుకుందన్న విషయం తెలుసుకున్న పోలీసు సిబ్బంది అర్థరాత్రి వేళ.. అదరాబాదరగా హోంమంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. జక్కంపూడి రాజాను అదుపులోకి తీసుకొని రాజమహేంద్రవరం వైపు తరలించారు. తనపై దాడి జరిగినా ఇప్పటివరకూ అందుకు బాధ్యుడైన ఎస్ఐపై చర్యలు తీసుకోలేదన్న ఆగ్రహంతో నిరసనను నిర్వహించారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేగింది.