Begin typing your search above and press return to search.
వైసీపీలో ఆయన రూటే డిఫరెంటు
By: Tupaki Desk | 12 July 2022 7:53 AM GMTరాజకీయ నేతల మానవత్వం బాగా వైరల్ అవుతుంది. బహుశా వాళ్లలో ఆ కోణం తక్కువనేమో మరి.నిరంతరం మన ప్రతినిధులు మన గురించి ఆలోచించాలని ఆశించడం తప్పేం కాదు, కానీ చాలా చాలా తక్కువ మంది ప్రజల కష్టాలను గుర్తిస్తారు. కొన్నిసార్లు వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అలాగే కనిపిస్తారు.
అప్పట్లో వైసీపీ తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేసి అమరావతి యాత్ర ( న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకూ పేరిట అమరావతి సాధన సమితి తటపెట్టిన యాత్ర) కార్యక్రమంలో భాగంగా తన జిల్లాకు వచ్చారు కదా అని వదిలేయక సంబంధిత రైతులకు ఆ రోజు అన్నం పెట్టి పంపారు. అప్పట్లో వైరల్ అయ్యారు. ఆ తర్వాత కూడా మరోసారి డ్రైనేజో దిగారు. తర్వాత ఇపుడు మళ్లీ నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి వార్తల్లో నిలిచారు.
ఆ మధ్య డ్రైనేజీ పనులు చేయలేదని రైల్వేశాఖకూ, మున్సిపల్ యంత్రాంగానికీ మధ్య గ్యాప్ ఉందని, సమన్వయ లోపం కారణంగానే తన నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డ్రైనేజీలో నే కూర్చొండి పోయి నిరసన తెలిపిన వైనం గుర్తుండే ఉంటుంది. ఆఖరికి నియోజకవర్గ అధికారులు కదలి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన మరో్ విధంగా వార్తల్లో ఉన్నారు. ఓ చిన్నారు నిండు ప్రాణం కాపాడి జేజేలు అందుకుంటున్నారు.
నెల్లూరు జిల్లాలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయనకు అప్పటికప్పుడు ఓ సమస్యకు పరిష్కారం చేయాలని తోచింది. అసలు ఆ పేద కుటుంబం బాధలు చూసి చలించి పోయారు. దీంతో వెనువెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించక ఆ కుటుంబానికి అన్నీ తానై నిలబడ్డారు. మామూలుగా కాదు ప్రభుత్వం తరఫున కూడా కాదు తన సొంత డబ్బులతో వైద్యం చేయించి మన్ననలు అందుకున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ చిన్నారి స్నేహ గుండె (హార్ట్) కు చిల్లి పడిందని వారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన ఆయన కారును ఏర్పాటు చేసి తన ప్రతినిధిని తిరుపతిలోని ఓ అత్యుత్తమ హాస్పిటల్ కు పంపి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ విజయవంతమై ఆ చిన్నారి, వారి తల్లిదండ్రులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే చిన్నారికి నూతన దుస్తులు బహుకరించారు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా కల్పించారు.