Begin typing your search above and press return to search.
వైసీపీ నేత సంచలనం: 175/175 తర్వాత సింగిల్ డిజిట్ వస్తుందా?
By: Tupaki Desk | 22 Dec 2022 4:07 AM GMTమనసులో ఉన్న మాటను నోటి ద్వారా చెప్పటం చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ.. కొన్నిస్థానాల్లో ఉండే కొందరికి అదంత తేలికైన విషయం కాదు. తమ నోటి నుంచి ఏ మాటలు అయితే రాకూడదో.
అలాంటి మాటలు మాట్లాడటం ద్వారా ఏమైనా జరిగే ప్రమాదం ఉందని తెలిసినా.. తెగించి మాట్లాడే ధైర్యం.. సాహసం చాలా కొద్దిమందికే ఉంటుంది.
అందునా ఏపీ లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు బాధ పడేలా.. తీవ్రమైన వ్యాఖ్యలు చేసే వారికి అందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు.
తాజాగా అలాంటి సాహసానికి తెర తీశారు వైసీపీ నేత.. దివంగత వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన డీఎల్ రవీంద్రారెడ్డి. తమ పార్టీ అధినేత పుట్టిన రోజునాడు మీడియాతో మాట్లాడిన డీఎల్ నోటి నుంచి వచ్చిన సంచలన వ్యాఖ్యలు అన్ని ఇన్నికావు.
ఆయన మాటల్ని వింటే జగన్ ఎలా రియాక్టు అవుతారన్నది అంచనా వేయలేనిదిగా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ డీఎల్ నోటి నుంచి షాకింగ్ వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే యథాతధంగా చూస్తే..
- జగన్ ముఖ్యమంత్రి అయినంతనే రాష్ట్రం బాగుపడుతుందని భావించా. కానీ ఇంత అవినీతికి పాల్పడతారని నా జీవితంలో అనుకోలేదు.
- జగన్ ఇంత అవినీతిపరుడైనందుకు నేను సిగ్గుపడుతున్నా.
- ఇసుక, లిక్కర్, మైనింగ్, మినరల్స్, చివరకు ఎర్రమట్టిని సైతం వదలకుండా కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల ద్వారా కోట్లాది రూపాయలను చేరవేసుకుంటున్నారు.
- అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి బాగుచేయాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యం.
- అడిగిన వారికి, అడగని వారికీ జగన్ ప్రభుత్వం పప్పుబెల్లాలు పంచినట్లుగా డబ్బులను విచ్చలవిడిగా దీంతో ఖజానా ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అప్పులతో కాలం వెళ్లదీసే పరిస్థితులు దాపురించాయి.
- గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం గాడి తప్పిన నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చంద్రబాబు తిరిగి పుంజుకునేలా చేశారు.
- రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా. అది వైసీపీ కావొచ్చు. ఇతర పార్టీల నుంచైనా కావొచ్చు.
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ.. జనసేన కలిసి పోటీ చేయొచ్చు. ఇప్పటికే దిగజారిన రాష్ట్ర పరిస్థితిని వారిద్దరూకలిసి పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నా.
- వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ సింగిల్ డిజిట్ వచ్చేది గొప్ప. 175కు 175 వస్తాయని వారునుకోవటం తప్పు లేదు. కానీ.. జనంలోకి వెళితే తెలుస్తుంది.
- గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా పసుపు కుంకుమ అని మహిళల ఓట్ల కోసం డబ్బులు పందేరం చేశారు. కానీ.. ఫలితం ఏమైంది?
- డబ్బు సంపాదన కోసం కడప జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి సోదరులు రూ.1466 కోట్ల ఖర్చుతో బైజూస్ ప్రీలోడెడ్ ట్యాబ్ ల పేరుతో ఒప్పందం చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.