Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. ఉరవకొండ లొల్లి!

By:  Tupaki Desk   |   12 March 2019 1:06 PM GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. ఉరవకొండ లొల్లి!
X
అంతా ఓకే అనుకున్న నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అడ్డం తిరుగుతూ ఉన్నాయి. ఇన్ని రోజులూ నివురుగప్పినట్టుగా ఉండిన ఉరవకొండ నియోజకవర్గం లొల్లి ఇప్పుడు బయటపడింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మీద తిరుగుబాట్లు చెలరేగాయి. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు విశ్వేశ్వర రెడ్డి. కదిరి నుంచి గెలిచిన చాంద్ భాషా ఫిరాయించగా..విశ్వేశ్వరరెడ్డి కొనసాగుతూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఆయనకే టికెట్ ఖరారు అయ్యింది. అయితే.. విశ్వేశ్వర్ రెడ్డి మీద ఇప్పుడు వైసీపీలోనే రెండు తిరుగుబాట్లు మొదలయ్యాయి. వాటిలో ఒకటి ఆయన సొంత తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాగా.. రెండోది సీనియర్ నేత శివరామిరెడ్డి ఆధ్వర్యంలో.

వారిద్దరూ టికెట్ ఎవరికి వారు తమకు కావాలని అంటున్నారు. ఈ గొడవ వైఎస్ ఆర్ సీపీ కార్యాలయం వరకూ చేరింది. వీరి అనుచరులు నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ వివేకానందరెడ్డి కాన్వాయ్ ను కూడా వీరు అడ్డుకున్నారు. అలాగే అనంతరం జిల్లా వ్యవహారాల ఇన్చార్జి మిథున్ రెడ్డి - విజయ్ సాయిరెడ్డిలను కూడా వీరు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో.. వారు సర్ధి చెప్పడానికి ప్రయత్నించారు ముఖ్య నేతలు. గొడవ చేయవద్దని వారు సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే విశ్వేశ్వరరెడ్డి కి టికెట్ ఇవ్వకూడదని - మధుసూదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని ఒక వర్గం - శివరామిరెడ్డికి టికెట్ ఇవ్వాలని మరో వర్గం వాదించినట్టుగా సమాచారం. మొదట మర్యాదగా చెప్పి చూసిన.. విజయ సాయిరెడ్డి - మిథున్ రెడ్డిలు ఆ తర్వాత… గొడవ - నినాదాలు ఆపకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారట. దీంతో వారు వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది.

మొత్తానికి ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లొల్లి ఇప్పుడు బయటపడింది. ఇదంతా విశ్వేశ్వర్ రెడ్డి ఓడిపోతాడు అతను కరెక్ట్ కాదు .. పార్టీ కి నష్టం శివరామిరెడ్డికి ఇస్తే నెగ్గుతాడు పార్టీ రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది అని గొడవ చేస్తున్నారట .. నిజం గానే ఆయనే నుంచుంటే గెలిచే ఛాన్స్ లు లేవని అంటున్నారు ఒక వర్గం. మరో వర్గం మంత్రి పదవుల లెక్కలతో రేపుతున్న గొడవలు అని.. విశ్వేశ్వర్ రెడ్డి మళ్లీ గెలిస్తే మంత్రి పదవి విషయంలో తమకు అడ్డంకి అవుతాడని.. ఆయన మీద వైసీపీలోనే ఒక వర్గం కుట్ర చేస్తోందనే టాక్ కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం!