Begin typing your search above and press return to search.
మహిళా ఎస్ఐ పై చేయి చేసుకున్న వైసీపీ నేత
By: Tupaki Desk | 12 March 2020 5:36 AM GMTఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రణరంగం చోటుచేసుకుంది. వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ నేత.. ఓ మహిళా ఎస్ఐపై చేయిచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లాలో పోలీస్ అధికారి అయిన ఎస్ఐ.. అందులోనూ మహిళా అధికారిపై వైసీపీ నేత చేయిచేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ మేరకు వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది.
శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్ఐ లలితపై స్థానిక సంస్థల నామినేషన్ల సందర్భంగా సరు బుజ్జిలి మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సమ్మ చేయి చేసుకున్నారట.. క్యూలో రమ్మన్నందుకు ఎస్ఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
అయితే అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనుకాడారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏపీలో రచ్చ మొదలైంది. ఇప్పటికే టీడీపీ నేతలైన బోండా ఉమా, బుద్ద వెంకన్న ప్రయాణిస్తున్నకార్లపై దాడి జరిగింది. ఇప్పుడు మహిళా ఎస్ఐపై చేసుకోవడం తో ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.