Begin typing your search above and press return to search.
చంద్రబాబుతో వైసీపీ నేత.. ఏంటా కథ?
By: Tupaki Desk | 20 Jun 2021 12:30 AM GMTసాధారణంగా అధికార పార్టీలో చేరడానికి నేతలు క్యూ కడుతారు. ప్రతిపక్ష పార్టీ వైపు అస్సలు తిరిగి చూడరు. కానీ చంద్రబాబుకు ఇప్పుడు ఊహించని పరిస్థితి ఎదురైందట.. ఇప్పటికే చంద్రబాబు పార్టీకి చెందిన కింది స్థాయి నేతలంతా వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్దతు పలికారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న నినాదాలు వినిపిస్తున్నాయి.
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వైసీపీకి చెందిన ఒక నేత.. అదీ సీఎం జగన్ సొంత జిల్లా వ్యక్తి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నేత ఎవరు? ఎందుకు వెళ్లారన్నది చర్చనీయాంశమైంది.
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ సభ్యుడు, వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఇద్దరూ భేటి అయినట్టు సమాచారం. రాయచోటి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్టుగా చెబుతున్నారు. పార్టీలో చేరే అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలు ఇవ్వాలని.. పార్టీని బలోపేతం చేస్తానని బాబుకు రాంప్రసాద్ రెడ్డి విన్నవించినట్టు తెలిసింది. రాంప్రసాద్ రెడ్డి ఇదివరకే చంద్రబాబును కలిసారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా శ్రీకాళహస్తికి వెళ్లిన సందర్భంలోనూ వీరిద్దరి భేటి జరిగింది. స్తానిక రాజకీయ పరిణామాలతోనే ఆయన పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్టుగా చెబుతున్నారు.
మరి దీనిపై వైసీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.