Begin typing your search above and press return to search.

క‌ళ్లు క‌నిపించ‌డం లేదా?: ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌ల‌ ఫైర్‌..

By:  Tupaki Desk   |   16 Nov 2022 2:30 AM GMT
క‌ళ్లు క‌నిపించ‌డం లేదా?: ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌ల‌ ఫైర్‌..
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ  మంత్రులు.. జ‌న‌సేన అధినేత  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మ‌రోసారి ఫైర‌య్యారు. తాజాగా ప‌వ‌న్ విజ‌య‌న‌గ‌రంలో నిర్మిస్తున్న జ‌గ‌న‌న్న ఇళ్ల లే అవుట్ల‌ను ప‌రిశీలించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదే విష‌యంపై మంత్రులు స్పందించారు. 31 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. పవన్‌కల్యాణ్‌కు క‌ళ్లుండీ కనిపించలేదా అంటూ మండిపడ్డారు.

జగనన్న కాలనీలపై పవన్ కల్యాణ్ కళ్లులేని కబోది తరహాలో మాట్లాడుతున్నారని  మంత్రి జోగి రమేష్ విమర్శించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి.. రాప్తాడు నియోజకవర్గంలోని ఆలమూరు జగనన్న కాలనీ లేఔట్ను పరిశీలించారు. రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్ మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. పవన్ కల్యాణ్కు కనిపించలేదా అన్నారు.

ఇళ్ల నిర్మాణాలు జరిగే కాలనీలకు తమతో కలిసి రమ్మని చెప్పినా కానీ.. చంద్రబాబు, పవన్ రావటం లేదని విమర్శించారు. గృహ నిర్మాణాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని మంత్రి చెప్పారు. పేదల కోసం భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. తమ నేత సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకున్నారు కాబట్టే.. పేదల కోసం పని చేస్తున్నారన్నారు. గృహ నిర్మాణాల పురోగతి, జగనన్న కాలనీలపై జిల్లా అధికారులతో మంత్రి రమేష్ సమీక్ష నిర్వహించారు.

చంద్ర‌బాబు స్క్రిప్టు ప్ర‌కార‌మే: ధ‌ర్మాన‌
 
చంద్రబాబు నాయుడి స్క్రిప్ట్కు.. పవన్కల్యాణ్ యాక్షన్ చేస్తున్నార‌ని మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ అన్నారు. పవన్కల్యాణ్పై  కృష్ణదాస్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్కు పవన్ కల్యాణ్ యాక్షన్ చేస్తున్నాడని విమర్శించారు. ఏ స్థాయిలో ఆయన జగనన్న కాలనీలు, కొండలు పరిశీలిస్తున్నారని ప్రశ్నించారు. ``ఆయ‌న ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, లేక ప్ర‌జాప్ర‌తినిధా, కేంద్రం న‌నుంచి వ‌చ్చిన ప్ర‌తినిధా? ఏఅధికారం ఉంద‌ని ప‌రిశీల‌న చేస్తున్నాడు`` అని మండిప‌డ్డారు. ఇప్పటికైనా పవన్ వెకిలి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.