Begin typing your search above and press return to search.
కమ్మ ఓట్లు మాకొద్దు.. వైసీపీ డిక్లరేషన్ ఇవ్వబోతోందా?
By: Tupaki Desk | 19 Oct 2022 1:30 PM GMTఏపీ అధికార పార్టీ శైలి చూస్తే.. ఇదే అనుమానం కలుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ``కమ్మ వారి ఓట్లు మాకొద్దు..`` అని డిక్లరేషన్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎందుకంటే.. మీడియా ముందుకు వచ్చే వైసీపీ నాయకులు ఈ సామాజిక వర్గాన్నే టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కోపంతో.. ఏకంగా..ఆయన సామాజిక వర్గమైన కమ్మలను టార్గెట్ చేయడం.. పరిపాటిగా మారిపోయింది.
ఉదాహరణకు రాజధాని అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు.. తొలిసారి.. మంత్రి స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ.. అదిఅమరావతి కాదు.. `కమ్మరావతి` వారి కోసమే కట్టుకుంటున్నారు.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఆ తర్వాత.. ఇదే పంథాలో అనేక మంది నాయకులు ముందుకు సాగారు. పత్రికలను కూడా.. ఈ కోవలోకే చేర్చేశారు. టీడీపీకి అనుకూలంగా ఏ వార్త రాసినా.. దానిని `కమ్మ మీడియా` అని కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఇలా.. కమ్మలను టార్గెట్ చేయడం.. వైసీపీలో షరా మామూలుగా మారిపో యింది. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రను కూడా.. కమ్మ వర్గమే ముందుండి నడిపిస్తోందని.. అందులో దళితులు లేరు.. దళితుల ముసుగులో కమ్మలే నడుస్తున్నారని.. ఇలా.. వైసీపీ హేళన చేసింది. ఇక, తాజాగా జనసేన విషయాన్ని తీసుకుంటే.. ఆ పార్టీ చీఫ్ పవన్.. టీడీపీతో చేతులు కలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం... అంటూ.. ఆయన.. చంద్రబాబును కలిసి.. జై కొట్టారు. అయితే.. దీనిపై కూడా.. మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. `అది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన`` అని వివాదాలకు దిగారు. `జనసేన కాదు.. కమ్మసేన` అని వ్యాఖ్యానించారు. ఇక మరో మంత్రి అంబటి రాంబాబు సైత.. `పవన్‌కు ఇప్పుడు `కమ్మ`గా ఉంది!!`` అని కామెంట్ చేశారు. ఇలా.. అనేక రూపాల్లో వైసీపీ నాయకులకు కమ్మలే కనిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వాళ్లు ఎప్పుడు అవకాశం చిక్కినా.. కమ్మలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే, రాజకీయాల్లో.. కేవలం కమ్మ సామాజిక వర్గమే ఉందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఓటర్లలో .. అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు. కమ్మ అంటే..ఒక్క టీడీపీ అనో..వైసీపీ అంటే..ఒక్క రెడ్డి అనో.. చెప్పడానికి వీల్లేదు. అన్ని పార్టీల్లోనూ అందరూ ఉన్నారు.
అంతేకాదు.. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. అన్ని సామాజిక వర్గాల ఆశీర్వాదం.. ఓటు బ్యాంకు కీలకం. మరి రెండో సారి.. వరుసగా.. ఐదారుసార్లు అధికారంలోకి రావాలని..లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీకి.. కమ్మ సామాజిక వర్గంంతో పనిలేదా? ఎందుకు ఆ సామాజిక వర్గాన్ని దూరం పెడుతున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బహుశ ఈ క్రమంలో కమ్మ ఓట్లు మాకొద్దు.. అని వైసీపీ డిక్లరేషన్ ఇవ్వబోయినా ఆశ్చర్యం లదేని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.