Begin typing your search above and press return to search.
ఆయనను ఈ సారి మార్చాల్సిందే బాస్.. వైసీపీలో కొత్త డిమాండ్...!
By: Tupaki Desk | 1 Dec 2022 11:30 PM GMTవైసీపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి మార్పులు, చేర్పుల ప్రక్రియకు అప్పుడే అడుగులు పడుతు న్నాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను అధిష్టానం మార్చాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. అయితే.. మరికొన్ని స్థానాల్లో మాత్రం అక్కడి నాయకత్వమే మార్పు చేయాలని చెబుతోంది. ఈయనను మార్చాల్సిందే.. అని నాయకులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
అయితే.. చిత్రంగా ఇలా డిమాండ్ చేస్తున్నవారు.. చేస్తున్న నియోజకవర్గాలు రోజు రోజుకు పెరుగుతుండ డం గమనార్హం. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి అప్పలరాజు విషయంలో నాయకులు ఇదే తీర్మానం చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని.. తమను అసలు పట్టించు కోవడం లేదని.. ఇక్కడి కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే.
అయితే.. ఇలాంటి ఫిర్యాదులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజ కవర్గంలోనూ ఇప్పుడు ఇదే వాదన తెరమీదికి వస్తోంది. ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రక్షణ నిధికి వ్యతిరేకంగా ఓ వర్గం చక్రం తిప్పుతోంది. ఆయన వల్ల ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని.. ఆరోపిస్తుండడంతోపాటు.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారి వారుస్వయంగా చెబుతుండడం గమనార్హం.
ఇటీవల గడపగడపకు కార్యక్రమంలో రక్షణనిధికి ఒకింత సెగ తగిలినమాట వాస్తవమే. ఆయనకు ప్రజల నుంచి నిరసన కూడా వ్యక్తమైంది. కొన్ని సమస్యల పరిష్కారం విషయంలో ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలు ఎమ్మెల్యే మెడకు చుట్టుకున్నాయనేది తెలిసిందే. అయితే, ఇది ప్రజల్లోకి వ్యతిరేకంగా చేరదడం ఇప్పుడు మరింత వేడెక్కిస్తోంది.
మీరు మాకు అవసరం లేదంటూ.. కొన్ని వార్డుల్లో ప్రజలు తలుపులు వేసుకున్నారు. దీనివెనుక పార్టీలో కొందరు చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. అయితే.. ఇలాంటివి కామనేని పార్టీ అధిష్టానం పక్కన పెడుతుందా? లేక.. మార్పులు చేస్తుందా? అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.