Begin typing your search above and press return to search.

వైసీపీలో 'మేధావుల‌' మంత‌నాలు.. స‌జ్జ‌ల‌-సాయిరెడ్డి భేటీ.. రాజ‌కీయ గుస‌గుస ఇదే!

By:  Tupaki Desk   |   7 May 2022 3:29 AM GMT
వైసీపీలో మేధావుల‌ మంత‌నాలు.. స‌జ్జ‌ల‌-సాయిరెడ్డి భేటీ.. రాజ‌కీయ గుస‌గుస ఇదే!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క నాయ‌కులుగా గుర్తింపు పొందిన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు.. ముఖ్య పొజిష‌న్‌లో ఉన్న నాయ‌కులు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వేణుబాక్కం విజ‌య‌సాయిరెడ్డిలు. వీరిద్ద‌రూ కూడా ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కుడి-ఎడ‌మ భుజాలుగా ఉన్న విష‌యం తెలిసిందే. అటు కేం ద్రంలో సాయిరెడ్డి చ‌క్రం తిప్పుతున్నారు. ఎంపీల‌ను త‌న‌దైన శైలిలో న‌డిపించ‌డంతోపాటు.. బీజేపీతో వైసీపీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను ఆయ‌న చాలా ద‌గ్గ‌ర‌గా న‌డిపిస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది.

జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు దీటుగా సాయిరెడ్డి కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణ‌యాలు.. ఏపీ అవ‌స‌రాలు.. ఇలా ఏదైనా కూడా సాయిరెడ్డి స‌మ‌క్షంలో జ‌రుగుతున్న విష యం తెలిసిందే. ఇక‌, మ‌రో నేత స‌జ్జ‌ల రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్నారు. పార్టీలోనూ.. ప్ర‌భుత్వంలోనూ ఆయ‌న నెంబ‌ర్‌2 పొజిష‌న్‌లో ఉన్నార‌నేది వైసీపీ నాయ‌కుల మాట‌. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ను ఆయ‌న న‌డిపిస్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను విన‌డం.. అధినేత మాట అనుస‌రించి.. నిర్ణ‌యాలు తీసుకో వ‌డం.. స‌జ్జ‌ల ప్ర‌ధాన క‌ర్త‌వ్యంగా ఉన్న విష‌యం తెలిసిందే.

అంతేకాదు, ఇటు స‌జ్జ‌ల‌, అటు సాయ‌రెడ్డి ఇద్ద‌రూకూడా పార్టీ వాయిస్‌ను ప‌లు వేదిక‌ల‌పై వినిపిస్తూ ఉన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు చేసే కామెంట్ల‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డంతోపాటు.. పార్టీ వ్యూహాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్నారు. ఇలా.. ఏవిధంగా చూసుకున్నా.. సీఎం జ‌గ‌న్‌కు కుడి-ఎడ‌మ భుజాలుగా ఈ ఇద్దరు నాయ‌కులు ప‌నిచేస్తున్నార‌నేదినిర్వివాదాంశం., అయితే.. ఈ ఇద్ద‌రు నేత‌లు.. ఎదురు ప‌డిన సంద‌ర్భాలు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా బ‌హిర్గ‌తం కాలేదు. ఎప్పుడైనా వారు క‌లుసుకుని, చ‌ర్చించిన సంద‌ర్భాలు కూడా పెద్ద‌గా బ‌య‌ట‌కు పొక్క‌లేదు.

కానీ, తాజాగా శుక్ర‌వారం స‌జ్జ‌ల‌-సాయిరెడ్డిలు భేటీ అయ్యారు. దాదాపు గంట‌కు పైగా ఇద్ద‌రూ చ‌ర్చించుకు న్నారు. ఈ ఏకాంత చ‌ర్చ‌ల్లో ఏం మాట్లాడుకున్నార‌నేది ఒక ఆస‌క్తిక‌ర విష‌యం అయితే.. కీల‌క నేత‌ల భేటీనేఇటు సొంత పార్టీలోనూ.. అటు ప్ర‌తిప‌క్షంలోనూ చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌స్తుతం అటు కేంద్రంలో నూ.. ఇటు రాష్ట్రంలోనూ.. వైసీపీ కొంత మేర‌కు వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దూకుడు పెంచింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తోంది.

అదేస‌మ‌యంలో కేంద్రంనుంచి ఇటీవ‌ల స‌హ‌కారం ఆక‌స్మికంగా నిలిచిపోయినట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అప్పులు చేసేందుకు ఏపీకి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌చ్చ జెండా ఊపిన కేంద్రం ఆక‌స్మికంగా.. ఈ నెల‌లో నాలుగు ప‌ర్యాయాలు త‌న చుట్టూ తిప్పించుకుంది. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌ల భేటీ కూడా ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే.. వ‌చ్చే ఎన్నిక‌లు వైసీపీ అత్యంత కీల‌కంగా మార‌డం కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌తిప‌క్షాలు అన్నీ ఏక‌మై.. వైసీపీపై పోరాడేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు ఏక‌తాటిపైకి వ‌స్తే.. ఎలా ఎదుర్కొనాలనే విష‌యం కూడా ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. కేవ‌లం సంక్షేమంతోనే ఎన్నిక‌ల‌కు వెళ్తే.. వ‌చ్చే లాభ న‌ష్టాలు.. ఎదుర‌య్య క‌ష్ట న‌ష్టాలు కూడా వీరిమ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయాయి. చాలా మంది నాయ‌కులు.. తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంపైనా.. స‌జ్జ‌ల‌-సాయిరెడ్డి చ‌ర్చించార‌నే అంశం.. ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా.. సీఎం జ‌గ‌న్‌కు ఆప్త‌మిత్రులుగా.. ఆత్మ‌బంధువులుగా ఉన్న స‌జ్జ‌ల‌ల‌-సాయిరెడ్డిల భేటీ రాజ‌కీయంగా వేడి ని ర‌గిలించింద‌నేది వాస్త‌వం.