Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాల‌న‌క‌న్నా.. బ్రిటీష్ పాల‌నే భేష్‌: వైసీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   8 Feb 2022 11:30 AM GMT
జ‌గ‌న్ పాల‌న‌క‌న్నా.. బ్రిటీష్ పాల‌నే భేష్‌:  వైసీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌న ఎలా ఉన్నా.. ఆయ‌న విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల కంటే.. సొంత పార్టీ నేత‌లు చేస్తున్న కామెంట్లే కాక రేపుతున్నాయి. తాజాగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో అన్న‌మ‌య్య జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ర‌గ‌డ జ‌రుగుతోంది. కొత్త‌గా ఏర్ప‌డే.. అన్న‌మ‌య్య జిల్లాకు రాజంపేట‌ను కేంద్రంగా చేయాల‌ని ఇక్క‌డి వారు ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం రాయ‌చోటిని కేంద్రంగా ప్ర‌క‌టించింది. దీంతో ఇక్క‌డ విప‌క్షాల కంటే కూడా అధికార ప‌క్షంలోని నాయ‌కులే రోడ్డెక్కారు.

దీనికి కూడా కార‌ణం ఉంది. రాయ‌చోటి ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డిని వ్య‌తిరేకించే వర్గాలు ఇప్ప‌డు ఏక‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే రాజంపేట కోసం.. తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మిస్తున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మిస్తున్న నాయ‌కులు మంగ‌ళ‌వారం నంద‌లూరు, రాజంపేట బంద్ పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ సార‌థ్యంలోని పాల‌న‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే సోద‌రుడు నోరు పారేసుకున్నారు. జ‌గ‌న్ పాల‌న బ్రిటీష్ వాళ్ల‌కంటే దారుణంగా ఉంద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌లుచేసింది.. రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జునరెడ్డి సోద‌రుడు సుండుప‌ల్లె మండ‌ల వైసీపీ ఇన్‌చార్జ్ మేడా విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి కావ‌డం గ‌మ‌నార్హం. లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గం రాజంపేట‌ను కాద‌ని, రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను ప్ర‌క‌టించ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా నిర‌సించారు. త‌మ గోడు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌డం లేద‌ని.. ఆయ‌న అన్నారు. బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీలో విజ‌య శేఖ‌ర్‌రెడ్డి క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

దీంతో రాజ‌కీయాలు, పార్టీల కంటే ప్రాంతానికే మొద‌టి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు వైసీపీ నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సొంత ప్ర‌భుత్వం రాజంపేట‌కు బ‌దులు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డాన్ని విజ‌య‌శేఖ‌ర‌రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. బంద్‌ను విజ‌య‌వంతం చేసేందుకు విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి, కొండూరు శ‌ర‌త్‌కుమార్ రాజు, నంద‌లూరు మండ‌లాధ్య‌క్షుడు మేడా విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని ముందుకు సాగారు. విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు.

ప్ర‌జాభీష్టానికి వ్య‌తిరేకంగా అన్న‌మ‌య్య జిల్లాను ప్ర‌క‌టించార‌ని, అస‌లు ఏ మాత్రం సంబంధం లేని అన్న‌మ‌య్య పేరుతో రాయ‌చోటి కేంద్రంగా జిల్లాను ఎలా ఏర్పాటు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. కొంద‌రు వైసీపీ పెద్ద‌లు ఉద్దేశ పూర్వ‌కంగానే రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు రాయ‌చోటిని తెర‌పైకి తెచ్చార‌ని ప‌రోక్షంగా గ‌డికోట శ్రీకాంత్‌పై విమ‌ర్శ‌లు సంధించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను వైసీపీ పెద్ద‌లు(గ‌డికోట) త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఉద్య‌మాన్ని అణ‌చివేయ‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం బ్రిటీష్ కాలం నాటి రోజుల‌ను గుర్తు చేస్తోంద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌పై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.