Begin typing your search above and press return to search.

వైసీపీలో కొంద‌రి ప‌రిస్థితి ఇంతే.. విష‌యం ఏంటంటే!

By:  Tupaki Desk   |   28 Sep 2021 3:42 AM GMT
వైసీపీలో కొంద‌రి ప‌రిస్థితి ఇంతే..  విష‌యం ఏంటంటే!
X
వైసీపీలో చాలా మంది నాయ‌కులు ఎంతో అంకిత భావంతో ప‌నిచేశార‌నేది వాస్త‌వం. ఇంకా ఇలానే చేస్తున్నా ర‌నేది కూడా వాస్త‌వం. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో కొంచెం క‌ష్టంతో ఎక్కువ మైలేజీ పొందాల‌ని అంద రూ ఆశిస్తున్నారు. ఇలా వ‌చ్చి.. అలా ప‌ద‌వులు కొట్టేయాల‌ని చూస్తుంటారు. అయితే.. కొంద‌రికి ప‌ద‌వులు ద‌క్కుతుంటే.. మ‌రికొంద‌రు ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అయితే.. వైసీపీలోని కొంద‌రికి మాత్రం రెడ్డి ట్యాగే ఇప్పుడు ప‌ద‌వుల‌కు ప్ర‌ధాన అడ్డంకిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా చిత్తూరు, క‌డ‌ప‌,క‌ర్నూలుకు చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గం.. వైసీపీ అధినేతజ‌గ‌న్ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేసింది.

కానీ.. ఇప్పుడు వీరికి ప‌ద‌వులు ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. కీల‌క‌మై న రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి ముగ్గురు నాయ‌కులు క‌నిపిస్తున్నారు. భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి(తిరుప‌తి), రోజా రెడ్డి(న‌గిరి), చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి(చంద్ర‌గిరి). ఇక‌, క‌డ‌ప జిల్లాను ప‌రిశీలిస్తే.. సీఎంకు సొంత బంధు వుల తోపాటు.. స్నేహితులు, మిత్రులు కూడా ఎక్కువ మంది రెడ్లు ఉన్నారు. రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు), గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి(రాయ‌చోటి), పి. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి(క‌మ‌లాపురం), మేడామ‌ల్లికార్జున రెడ్డి(రాజంపేట‌).. వంటివారు ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు.

వీరంతా కూడా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకోసం ప‌నిచేయ‌డంతోపాటు.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌ను చూడాల‌ని కోరుకున్న‌వారే. అయితే.. వీరిలో ఒక‌రిద్ద‌రి పేర్లు గ‌త కేబినెట్ కూర్పు స‌మ‌యంలో ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే అంచ‌నాలు వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి, పి. రవీంద్ర‌నాథ్ రెడ్డి పేర్లు వినిపించాయి. వీరికి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తార‌ని అనుకున్నారు. కానీ, దక్క‌లేదు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న కేబినెట్ కూర్పులో అయినా.. ప‌ద‌వులు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని వారు అనుకుంటున్నారు. అయితే.. వీరికి ఉన్న రెడ్డి ట్యాగే ఇప్పుడు మ‌రోసారి ప్ర‌తిబంధ‌కంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒక‌వేళ మంత్రి ప‌ద‌వులు రెడ్డి వ‌ర్గానికి ఇచ్చినా.. ఈ ద‌ఫా కూడా ఇద్ద‌రు ముగ్గురుకే ప‌రిమితం చేస్తార‌ని అంటున్నారు. వారిలో ఫైర్ బ్రాండ్ల‌ను ప‌క్కన పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అంటే.. రోజా చెవిరెడ్డి.. వంటివారికి ఛాన్స్ ద‌క్క‌ద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో రాచ‌మ‌ల్లు వంటివారికి కూడా అవ‌కాశం చిక్క‌క‌పోవ‌చ్చ‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చేది ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం కావ‌డం.. ప్ర‌తి విష‌యాన్నీ సునిశితంగా డీల్ చేయాల్సి రావ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో ఎక్కువ మంది రెడ్డేత‌ర సామాజిక వ‌ర్గాల‌కు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. దీంతో రెడ్డి వ‌ర్గం ఇక‌, కాడి మోయ‌డం వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఇది ఎలాంటి ప‌రిస్థితికి దారి తీస్తుందో చూడాలి.