Begin typing your search above and press return to search.
విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ ఆధిక్యం.. బెజవాడలో శ్వేత గెలుపు
By: Tupaki Desk | 14 March 2021 8:19 AM GMTఏపీలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తుండడంతో ఆ పార్టీలో సంబరాలు మిన్నంటాయి.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి డప్పులు మోగిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీలోనే అత్యధిక స్థానాలున్న పెద్ద కార్పొరేషన్ విశాఖలో వైసీపీ ఆధిక్యంలోకి వచ్చింది. తాజాగా వైసీపీ 11 స్థానాల్లో, టీడీపీ 9, జనసేన 1, స్వతంత్రులు 1, సీపీఎం 1 చోట విజయం సాధించారు. ఇక బ్యాలెట్ బాక్సుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రాసిన పత్రాలు కనిపిస్తున్నాయి. విశాఖలో మొత్తం 90 డివిజన్లు ఉన్నాయి.
విజయవాడ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన టీడీపీ మేయర్ అభ్యర్థిగా 11వ డివిజన్ నుంచి పోటీచేసిన కేశినేని శ్వేత విజయం సాధించారు. 24 ఏళ్ల శ్వేత ఫారిన్ లో విద్యాభ్యాసం చేసి కీలక సంస్థల్లో పనిచేసి ఇండియాకు వచ్చారు.
విజయవాడ నగర పాలక సంస్థలో హోరాహోరీ నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. వైసీపీ 8 డివిజన్లు, టీడీపీ 6 డివిజన్లు కైవసం చేసుకుంది. విజయవాడ తూర్పులో టీడీపీ ప్రభావం ఉండగా.. సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. దీంతో ఇక్కడ హోరాహోరీ కొనసాగుతోంది.