Begin typing your search above and press return to search.
బద్వేల్ 5 రౌండ్ కు వైసీపీ మెజార్టీ 42వేలు.. ఏపీలో పార్టీనా కేసీఆర్?
By: Tupaki Desk | 2 Nov 2021 5:58 AM GMTఅందుకే అంటారు రాజకీయంలో మాటకు ఉండే విలువ అంతా ఇంతా కాదని. టైం కాని టైంలో అనకూడని మాటను అనేస్తే దాని వల్ల జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుంది. తన మాటలతో కోట్లాది మందిని మంత్రముగ్దుల్ని చేసే కేసీఆర్ లాంటి అధినేత.. తన మాట కారణంగా ఎటకారపు మాటలు పడతానని అస్సలు ఊహించి ఉండరేమో? ఏ ఏపీ పేరుతో ఆయన రాజకీయ ప్రయోజనాన్ని పొందారో.. అదే ఏపీలో పార్టీ పెట్టాలంటూ తనను ఆంధ్రా ప్రాంతం వారు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది.
గతంలో కేసీఆర్ చేసిన ఏ వ్యాఖ్య మీదా జరగనంత చర్చ.. తాజాగా ప్లీనరీ వేళ.. ఏపీలో పార్టీ పెట్టాలంటూ అక్కడి వారు అడుగుతున్నారంటూ తమ పార్టీ గొప్పతనాన్ని చెప్పిన వైనం ఆయనకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారటమే కాదు.. ప్రతి ఒక్కరు ఆయన్ను వేలెత్తి చూపేలా క్వశ్చన్లు వేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఏపీలో పార్టీ పెట్టాలన్నకేసీఆర్ మాటపై ఏపీ అధికారపక్ష నేతలు ఘాటుగా రియాక్టు అయ్యారు. సాధారణంగా కేసీఆర్ మీద ఎవరైనా ఏదైనా మాట అంటే వెంటనే ఎవరో ఒకరు రియాక్టు అవుతారు. అందునా ఏపీ నేతలు ఎవరైనా స్పందించి.. విమర్శ చేస్తే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కౌంటర్ ఇచ్చే వరకు నిద్రపోని తత్త్వం గులాబీ నేతల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
మరి.. ఏమైందో కానీ.. ఏపీలో పార్టీ పెట్టాలని ఆంధ్రోళ్లు అడుగుతున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వచ్చిన రియాక్షన్ల మీద మాత్రం గులాబీ నేతలు ఎవరూ పెదవి విప్పటానికి సాహసించని వైనం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఒకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడి అవుతుంటే.. మరోవైపు ఏపీలో జరిగిన బద్వేల్ ఉప పోరు ఫలితాలు వెల్లడవుతున్నాయి. హుజూరాబాద్ లో మొదటి రౌండ్ మొదలు మూడో రౌండ్ ముగిసే నాటికి.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మెజార్టీ అంతకంతకూ పెరుగుతోందే కానీ.. ఒక్క రౌండ్ లోనే టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీ రాని పరిస్థితి.
అందుకు భిన్నంగా బద్వేల్ లో ఏపీ అధికారపక్షమైన వైసీపీకి చెందిన అభ్యర్థి డాక్టర్ సుధ మెజార్టీ అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ఇటీవల కాలంలో ఎవరికి రానంత భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఐదో రౌండ్ ఫలితం నాటికి డాక్టర్ సుధ అధిక్యత 42,824 ఓట్లుగా ఉన్న పరిస్థితి. ఆ మాటకు వస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మూడు రౌండ్లు ముగిసే నాటికి వచ్చిన ఓట్లు.. వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీలో సగమైనా వచ్చాయా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. బద్వేల్ లో వైసీపీ హవాను చూపిస్తున్న వారు.. ఏం కేసీఆర్.. ఇప్పుడు చెప్పండి.. ఏపీలో పార్టీ పెడతారా? అంటూ ఎటకారం ఆడేస్తున్నారు. ఓవైపు అధిక్యత రాక ఇబ్బంది పడుతున్న గులాబీ దళానికి.. తాజా ఎటకారం మరింత బాధిస్తోంది.