Begin typing your search above and press return to search.
టీడీపీకి కొత్త పేరు.. పిల్ల కాంగ్రెస్
By: Tupaki Desk | 4 Jun 2018 4:34 PM GMTతలాతోకా లేని కార్యక్రమాలను చేపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లేనని గత నవ నిర్మాణ దీక్షలో చెప్పిన చంద్రబాబు.. ఇటీవల కర్ణాటకలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చేతులు కలపడమేంటని బుగ్గన ప్రశ్నించారు. దీంతో ప్రజలకు తల్లి కాంగ్రెస్ - పిల్ల కాంగ్రెస్ ఎవరో తేలిపోయిందన్నారు. టీడీపీ - కాంగ్రెస్ తో చేతులు కలుపుతోందని.. రాష్ట్రాన్నిఅడ్డగోలుగా విభజించిన ఆ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కువుతున్నారన్న అర్థంలో బుగ్గన పరోక్ష విమర్శలు చేశారు.
ప్రభుత్వ డబ్బును టీడీపీ ప్రచారాలకు ఉపయోగిస్తున్నారని అన్నారు. చంద్రన్న మజ్జిగ పథకంలో కూడా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అనవసర ప్రకటలతో, పనులతో ఏడాదికి రూ. 12వేల కోట్ల నష్టం తెస్తున్నారని బుగ్గన ఆరోపించారు. పార్టీ సొమ్ముతో ఏమి చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదని చెప్పారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలకు డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందని.. చివరకు చంద్రన్న మజ్జిగ పథకంలో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని బుగ్గన ఆరోపించారు. పులివెందులకు కూడా నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పడాన్ని బుగ్గన తప్పుబట్టారు. పులివెందుల ఏపీలో లేదా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, స్థానిక సంస్థలు భ్రష్టు పట్టాయని మండిపడ్డారు.