Begin typing your search above and press return to search.

డెన్ ఆఫ్ డెవిల్.. బాబు పై చెవిరెడ్డి హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   27 Jan 2020 10:00 AM GMT
డెన్ ఆఫ్ డెవిల్.. బాబు పై చెవిరెడ్డి హాట్ కామెంట్స్
X
ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రభుత్వం చేసిన చట్టాలను మండలి ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారని.. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గతంలో మండలి వద్దని చెప్పిన బాబు.. ఇప్పుడు రద్దును ఎందుకు అడ్డుకుంటున్నారని చెవిరెడ్డి కడిగేశారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ,శాసన మండలి రెండు కూడా ‘ట్విన్ ఆఫ్ హౌస్’ అని పేర్కొన్నారు. రెండు సభలకు విడదీయరాని బంధం ఉందని.. కానీ చంద్రబాబు మాత్రం ట్విన్ ఆఫ్ హౌస్ ను డెన్ ఆఫ్ డెవిల్ గా మార్చారని దుయ్యబట్టారు. 1996లో శాసనసభలో ఎన్నీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. నేడు శాసనమండలిలో ప్రజాస్వామన్ని ఖూనీ చేశారని విమర్శించారు.

ఇక అసెంబ్లీ మీడియా సమావేశం లో మాట్లాడిన పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మీ సైతం ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ బిల్లు కూడా అడ్డుకొని చంద్రబాబు ఆయా సామాజికవర్గాలకు ద్రోహం చేశారని ఆరోపించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మండి పడ్డారు.

శాసనసభ బిల్లులను కూడా అడ్డుకుంటున్న చంద్రబాబు బలహీన వర్గాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని.. పేదల కోసం తెచ్చిన ఇంగ్లీష్ మీడియం అడ్డుకున్న పాపం ఊరికే పోదని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ వాపోయారు. అందుకే బాబును 20 సీట్లకు పరిమితం చేశారని ఆరోపించారు.