Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే క‌క్కుర్తి.. కో ఆప్ష‌న్ పోస్టుకు కూడా `ఆక్ష‌న్‌` పెట్టాడే!

By:  Tupaki Desk   |   26 April 2021 3:30 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే క‌క్కుర్తి.. కో ఆప్ష‌న్ పోస్టుకు కూడా `ఆక్ష‌న్‌` పెట్టాడే!
X
అధికారంలో ఉన్నది ఎందుకురా? అంటే.. చేతినిండా సంపాయించుకునేందుకు అన్నాడ‌ట‌..! అలానే ఉంది ఇప్పుడు వైసీపీ నేత‌ల ప‌రిస్థితి అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎక్క‌డ అవ‌కాశం వ‌స్తే.. అక్క‌డ ఏది అందుబాటులో దానిని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసుకోవ‌డం.. చేతినిండా సొమ్ములు రాబ‌ట్టుకోవ‌డం.. వంటివి కామ‌న్‌గా మారాయ‌ని చెబుతున్నారు. ఇలానే.. తాజాగా ప్ర‌కాశం జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్యేగారి వ్య‌వ‌హారం.. మ‌రింత ఎక్కువ‌గా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

స‌ద‌రు ఎమ్మెల్యే మ‌రీ క‌క్కుర్తి ప‌డుతున్నాడ‌ని.. పెద్ద ఎత్తున ఆ ప‌ట్ట‌ణంలోని వైసీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అస‌లు విష‌యం ఏంటి? అని ఆరా తీస్తే.. చాలా ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది. అదేంటంటే.. ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీ విజ‌యం సాధించింది. అయితే.. అక్క‌డ మునిసిపాలిటీలో అధికార పార్టీ ఇచ్చిన కొత్త జీవో ప్ర‌కారం.. మూడు కో ఆప్ష‌న్ స‌భ్యుల పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. వీరికి కౌన్సిల‌ర్ ల‌తో స‌మానంగా హ‌క్కులు ఉంటాయి.

దీంతో ఆయా పోస్టుల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో కొంత‌మంది ఓడిపోయిన వారు.. ఈ పోస్టుల‌ను మాకు ఇవ్వ‌డంటే మాకు ఇవ్వండి అంటూ.. ఎమ్మెల్యేను కోరుతున్నారు. అంతేకాదు.. ప‌దేళ్లుగా తాము.. పార్టీ కోసం ప‌నిచేస్తున్నామ‌ని, ఇప్ప‌టికైనా త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని వారు కోరుతున్నారు. అయితే.. స‌ద‌రు ఎమ్మెల్యే త‌మ్ముడు ఆ పోస్టుల‌ను అప్ప‌నంగా ఎలా ఇచ్చేస్తాం అనుకున్నారో.. ఏమో.. స‌ద‌రు కో ఆప్ష‌న్ పోస్టుల‌కు ఆక్ష‌న్(వేలం) పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ఆప్ష‌న్‌లో ఎవ‌రు ఎక్కువ రేటు ఇస్తే.. వాళ్ల‌కు స‌ద‌రుసీటు ఇస్తామ‌ని.. తెగేసి చెప్పిన‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది. అంతేకాదు.. `మీరు ప‌దేళ్ల నుంచి ఉన్నా.. పాతికేళ్ల నుంచి ఉన్నారా? అనేది మాకెందుకు? మాకు ఎలాంటి సెంటిమెంటు లేదు`` అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పాడ‌ట‌! దీంతో వైసీపీలో నిజాయితీగా ఉన్న నాయ‌కులు, పార్టీ కోసం అంకిత భావంతో ప‌నిచేసిన కార్య‌క‌ర్త‌లు.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

పోనీ.. ఇదే విష‌యాన్ని హైక‌మాండ్ ద‌గ్గ‌ర చెప్పి.. ఏదో ఒక‌టి తేల్చుకుందామ‌ని అనుకున్నా.. త‌మ మాట ఎవ‌రు వింటారు? ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీంతో ఇప్పుడు ఏం చేయాల‌ని అని త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. పైగా హైకమాండ్ కూడా ఆ ఎమ్మెల్యే విష‌యంలో పెద్ద‌గా చొర‌వ తీసుకోవ‌డం లేద‌ని.. అంటున్నారు. ఎన్ని సార్లు చెప్పినా.. స్పంద‌న కూడా శూన్యంగానే ఉంద‌ని.. అంతా వాళ్ల వాళ్లే పెత్త‌నం చేస్తున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం లోక‌ల్‌గా వైసీపీలో జ‌రిగిన ఈ త‌తంగం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.