Begin typing your search above and press return to search.
పాదయాత్రను ఆపించండి: ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు.. రీజనేంటంటే!
By: Tupaki Desk | 7 Nov 2021 2:30 PM GMTరాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా.. రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్రకు అధికార పార్టీ నుంచి అప్పుడే అడ్డంకులు ప్రారంభమయ్యాయి. పాదయాత్రకు సంబంధించి.. హైకోర్టు ఇచ్చిన ఆదేశలు ఉల్లంఘిస్తున్నారంటూ.. ప్రకాశం జిల్లా పోలీసులు రైతులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని.. వారు చెప్పినా.. ఏ ఒక్కరూ వినిపించుకోలేదు. ఇదిలావుంటే.. నోటీసులు ఇచ్చి.. 24 గంటలు కూడా కాకముందే.. వైసీపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆయన జిల్లా ఎస్పీని కలిసి.. పాదయాత్రను నిలుపుదల చేయాలని.. కోరారు. దీనికి సంబంధిం చి ఆయన చెబుతున్న కారణం.. జిల్లాలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉందని.. కోడ్ కొనసాగుతు న్నందున ఇక్కడ.. ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి అవకాశం లేదని.. పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన సంతనూతలపాడు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలని ప్రకాశం ఎస్పీని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పాదయాత్రకు అనుమతించొద్దని కోరారు. పాదయాత్రను నిలుపుదల చేయలేకపోతే రూట్ మార్చాలన్నారు.
ఒకవేళ.. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరోప క్క, . రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో 12 రోజులపాటు యాత్ర సాగనుంది. జిల్లాలో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, కందుకూరు, గుడ్లూరు తదితర మండలాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు పోలీసలు నోటీసులు, మరోవైపు.. వైసీపీ నేతల డిమాండ్ల మధ్య ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కనిపిస్తుండడం గమనార్హం.