Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే లబోదిబో!
By: Tupaki Desk | 10 Feb 2020 12:20 PM GMTఆంధప్రదేశ్ లో రాజకీయం రోజురోజుకి మరింత వేడెక్కుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఆందోళనలు ఎక్కువైపోయాయి. ఒకే రాష్ట్రం ..ఒకే రాజధాని ..మాకు రాజధానిగా అమరావతినే కావాలి అంటూ రాజధాని ప్రాంత ప్రజలు - రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ధర్నాలు - ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై తాజాగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ... మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీ లో ఆమోదించారు. కానీ, మండలిలో ఆ బిల్లు ఆగిపోయింది. దీనితో ఈ మూడు రాజధానుల వ్యవహారం కొంచెం సందిగ్దంలో పడిపోయింది. కానీ - మూడు రాజధానులని ఏర్పాటు చేసి తీరుతాం అని వైసీపీ నేతలు చెప్తున్నారు.
జగన్ సర్కార్ తీసుకున్న ఈ మూడు రాజధానుల నిర్ణయంపై సొంత పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. బహిరంగంగా పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేయలేకపోతున్నా కూడా తమ సన్నిహితుల వద్ద తమ గోడుని చెప్పుకుంటున్నారట. ఇకపోతే ఈ మూడు రాజధానుల నిర్ణయంతో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. దీనికి కారణం ఏమిటంటే..గత ఎన్నికల అనంతరం ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే బెంగళూరులో ప్రముఖ కాంట్రాక్టర్ గా ఉన్న ఒక ఎమ్మెల్యే ..తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసం పక్కనే కొంత స్థలాన్ని తీసుకోని ..ఇండిపెండెంట్ - అలాగే అపార్ట్ మెంట్ వెంచర్స్ వేశారు.
అప్పటికి మూడు రాజధానుల ప్రతిపాదన ఏదీ లేకపోవడం - అలాగే అప్పట్లో అమరావతిలో ల్యాండ్ వ్యాల్యూవ్ బాగా ఎక్కువగా ఉండటంతో ఉన్నదానికంటే ఎక్కువ రేటుకి పోటీ పడి మరీ ఫ్లాట్స్ కి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారు. ఇలా ఈ వ్యవహారం సాగుతున్న సమయంలోనే జగన్ సర్కార్ ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చు అని అసెంబ్లీ లో ప్రకటించడం ..ఆ తరువాత అసెంబ్లీ లో మూడు రాజధానులకి సంబంధించి బిల్లు కూడా పెట్టడంతో అమరావతిలో ల్యాండ్ వ్యాల్యూవ్ ఒక్కసారిగా పడిపోయింది. అలాగే రాజధాని కూడా అమరావతి నుండి విశాఖపట్నం కి షిఫ్ట్ అవుతుండటం తో రాజధాని ఇక్కడ లేనప్పుడు మాకు అమరావతిలో ఈ ప్లాట్స్ ఎందుకు అని - ఆ ప్లాట్స్ బుక్ చేసుకున్నవారంతా కూడా తమ అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఆ ఎమ్మెల్యే పై ప్రెజర్ పెడుతున్నారట. ఒక్కసారిగా అడ్వాన్స్ గా ఇచ్చిన అమౌంట్ ని - తిరిగి మళ్లీ వెనక్కి ఇవ్వడం అంటే ఎవరికైనా కష్టమే ..దీనితో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఆ ఎమ్మెల్యే లబోదిబో మంటు - కస్టమర్స్ కి అందుబాటులో కూడా లేరు అంట..