Begin typing your search above and press return to search.
పవన్ పుట్టిన రోజున అన్నదానం ప్రోగ్రాంకు వైసీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 5 Sept 2022 10:37 AM ISTమీరు చదివింది కరెక్టే. జనసేన పార్టీ అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నంతనే విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ నేతల తీరుకు భిన్నంగా.. ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు పవన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన వైనం ఆసక్తికరంగా మారింది.
సెప్టెంబరు 2న పవన్ బర్త్ డేను ఆయన అభిమానులు ఒక రేంజ్ లో నిర్వహించటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే.. పవన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్న ఈ ఫోటో రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసింది. ఇంతకీ.. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే ఎవరంటే.. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిలారు రోశయ్య.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో జరిగిన పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య హాజరు కావటం ఆసక్తికరంగా మారింది.
అన్నదానంలో పాల్గొన్న ఆయన.. జనసేన నాయకులతో కలిపి భోజనం వడ్డించిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.
ఆయనతో పాటు పెదకాకాని ఎంపీపీ..జెడ్పీటీసీ సభ్యురాలు కూడా హాజరయ్యారు. మరి.. దీనిపై వైసీపీ అధినాయకత్వం ఎలా రియాక్టు అవుతుందో? దానికి కిలారు రోశయ్య ఏమని బదులిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.