Begin typing your search above and press return to search.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్ర‌కాశం వైసీపీ ఎమ్మెల్యే..

By:  Tupaki Desk   |   31 Jan 2022 8:30 AM GMT
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్ర‌కాశం వైసీపీ ఎమ్మెల్యే..
X
ఏపీలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టిక్కెట్లు వ‌చ్చిన వారిలో చాలా మంది పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ధీమాతో భారీగా ఖ‌ర్చు చేసి ఎమ్మెల్యేలు అయ్యారు. మ‌రి కొంద‌రు పార్టీ కోసం భారీగా ఫండ్ ఇచ్చి మ‌రీ టిక్కెట్లు కొన్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గాల్లో కోట్లు ఖ‌ర్చు చేస్తే కాని వారు ఎమ్మెల్యేలు కాలేదు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు బాగా మ‌నీ స‌ర్యులేట్ అవ్వ‌డంతో వాళ్లు బాగా కూడ‌బెట్టుకున్నారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక కూడా అంతే జ‌రుగుతుంద‌ని అనుకున్నారు.

అయితే ఇక్క‌డ అభివృద్ధికి నిధులు లేక‌పోవ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో చిన్న ప‌నులు కూడా కాక‌పోవ‌డం.. రెండు సార్లు క‌రోనా దెబ్బ‌తో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

కొంద‌రు ఎమ్మెల్యేలు పార్టీ కార్య‌క‌ర్త‌ల ద‌గ్గ‌ర ఎన్నిక‌ల ముందు తీసుకున్న అప్పుల‌కు వ‌డ్డీలు కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే సైతం అప్పులు ఎక్కువైపోయి అస్స‌లు ఎవ్వ‌రికి అందుబాటులో ఉండ‌డం లేద‌ని అంటున్నారు.

చివ‌ర‌కు రోజువారి ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బులు లేక‌పోవ‌డంతో పార్టీలో ఎవ‌రి ద‌గ్గ‌ర బాగా డ‌బ్బులు ఉన్నాయో ఎంక్వైరీ చేయించుకుని.. వాళ్ల‌ను ఇంటికి పిలిపించుకుని స‌క‌ల మ‌ర్యాద‌లు ఇస్తూ.. సీనియ‌ర్ లీడ‌ర్ల‌కు అపాయింట్‌మెంటే ఇవ్వ‌డం లేద‌ట‌.. అలాగే వారి ఫోన్లు ఎత్త‌డం లేదు స‌రిక‌దా.. చివ‌ర‌కు పీఏల‌కు ఫోన్లు చేసినా సార్ ఇక్క‌డ లేరు.. బెంగ‌ళూరులో ఉన్నార‌ని ఆన్స‌ర్ చెప్పిస్తున్నార‌ట‌.

కొంద‌రికి వ్యాపారాల్లో వాటా ఇస్తాన‌ని డ‌బ్బులు తీసుకుని.. ఆ త‌ర్వాత ఏమీ ఇవ్వ‌కుండా..ఆ డ‌బ్బులు ఇవ్వ‌కుండా వారిని రెండు సంవ‌త్స‌రాల నుంచి త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ట‌. కొంద‌రు నాయ‌కులు ఎమ్మెల్యేకు డ‌బ్బులు ఇస్తే ప‌లుకుబ‌డి పెరుగుతుంద‌ని బ‌య‌ట అప్పులు చేసి మ‌రీ ఆయ‌న‌కు ఇచ్చార‌ట‌. త‌ర్వాత కాళ్ల చెప్పులు అరుగుతున్నాయే త‌ప్పా వాళ్ల డ‌బ్బులు మాత్రం ఎమ్మెల్యే నుంచి రావ‌డం లేద‌ట‌. ఇప్పుడు వీళ్లంతా ఓ బాధిత సంఘంగా ఏర్ప‌డి హైక‌మాండ్‌ను క‌లిసి చెప్పుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

ఇటీవ‌లే జిల్లాకే చెందిన మంత్రిని క‌లిసి వీరంతా త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నార‌ట‌. హైక‌మాండ్ ప‌ట్టించుకోక‌పోయినా.. త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోయినా కూడా చివ‌ర‌కు ఎమ్మెల్యే ఇంటి ముందే ఈ అప్పు ఇచ్చిన బాధుతులు ధ‌ర్నా చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే వీళ్లంతా ఎమ్మెల్యే ఇంటి ముందు ర‌చ్చ చేసేందుకు ప్ర‌య‌త్నించినా... ఏదో స‌ర్దుబాటు చేశార‌ట‌. ఏదేమైనా ఇప్పుడు ఎమ్మెల్యేకు అప్పు పెట్టిన వారంతా నెక్ట్స్ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు రాద‌న్న టెన్ష‌న్‌తో పాటు ఒక వేళ సీటు వ‌చ్చి ఆయ‌న గెల‌వ‌క‌పోయినా త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఆందోళ‌న చెందుతోన్న ప‌రిస్థితి.