Begin typing your search above and press return to search.
ఏం చేశారని మా దగ్గరకు వచ్చారు.. వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ!
By: Tupaki Desk | 12 Oct 2022 10:49 AM GMTఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్ జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు. అయితే చాలా చోట్ల తమకు వివిధ సంక్షేమ పథకాలు అందడం లేదని, లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని.. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయని.. గెలిచిన మూడున్నరేళ్ల తర్వాత తాము గుర్తొచ్చామా అని ప్రజలు నిలదీస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఎక్కడికక్కడ ప్రజలు వివిధ సమస్యలపై నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక.. సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేస్తున్నారని అంటున్నారు. మరికొంతమంది పోలీసులతో తమను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించడం, దబాయించడం, బెదిరించడం వంటివి చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజాగా కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. నియోజకవర్గం పరిధిలోని కంకిపాడు మండలం నెప్పల్లి ఎస్సీ కాలనీలో మంగళవారం నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఎమ్మెల్యే కాలనీలోకి ప్రవేశించే సమయంలో కొందరు మహిళలు, కాలనీవాసులు ఆయనను అడ్డుకున్నారని తెలుస్తోంది. ఎందుకు తనను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే వారిని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు ఈ మూడేళ్లలో మీరు తమకు ఏం మేలు చేశారని గడప గడపకూ వస్తున్నారని నిలదీశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా పర్యటన ఎందుకని అనడంతో ఎమ్మెల్యే పార్థసారథికి, స్థానికులకు కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.
సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఎస్సీ కాలనీ వాసులకు సూచించారు. దీంతో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, అర్హులైన చాలామంది పేర్లు జాబితాలో రాలేదని కాలనీ వాసులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనికితోడు గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షాకాలం కూడా కావడంతో మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరించాలని కోరుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామంలో శ్మశానం పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉందని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తెచ్చారు.
ఎస్సీ కాలనీ వాసుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంతలో పోలీసులు, స్థానిక నాయకులు కలిసి ఆందోళన చేస్తున్నవారిని పక్కకు తప్పించడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.