Begin typing your search above and press return to search.
ఏపీలో ఏదైనా సాధ్యమే బ్రో.. కోడిగుడ్లు కాకులు ఎత్తుకు పోయాయట!
By: Tupaki Desk | 11 Nov 2022 1:30 AM GMTపోలీసులు అప్పుడప్పుడు.. కోర్టుకు చిత్రమైన సమాధానాలు చెబుతుంటారు. ఇటీవల విశాఖ కోర్టులో పోలీసులు స్వాధీనం చేసుకున్న విదేశీ మద్యం బాటిళ్ల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా బాటిళ్లు ఏవని.. కోర్టు ప్రశ్నించింది. దీనికి పోలీసులు.. ఎలుకలు తాగేశాయని ఒక అఫిడవిట్ వేశారు. దీనిపై విచారణకు ఆదేశించాలా? అని కోర్టు ప్రశ్నించింది. దీంతో మరుసటి రోజు మరో అఫిడవిట్ వేసి.. ఎండలకు మద్యం ఆవిరైపోయిందంటూ.. ఒక రెండు బాటిళ్లు తెచ్చి కోర్టుకు చూపించారు. దీంతో న్యాయమూర్తి నివ్వెర పోయారు. ప్రస్తుతం ఇది విచారణలో ఉంది.
తాజాగా ఇలాంటి ఘటనే వైసీపీ ఎమ్మెల్యేకు ఎదురైంది. స్కూలు పిల్లలకు పెట్టాల్సిన మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు మిస్సయ్యాయి. ఈ విషయం ఎమ్మెల్యే నిలదీయడంతో అక్కడున్న అధికారులు.. చిత్రమైన సమాధానం చెప్పారు.
కోడిగుడ్లు కాకులు ఎత్తుకు పోయాయన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించేందుకు వెళ్లారు.
150 మంది విద్యార్థులుంటే 115 గుడ్లే ఉడకబెట్టడం ఎమిటని, మిగతా 35 గుడ్లు ఏమయ్యాయని ఎమ్మెల్యే నిలదీశారు. దీంతో ఏమాత్రం తడుముకోకుండా.. అక్కడ ఉన్న అదికారులు వాటిని కాకులు ఎత్తుకుపోయాయాని సమాధానం చెప్పారు. ఈ సమాధానంతో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖంగుతున్నారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, విద్యా కమిటి సభ్యులను మందలించి, వెంటనే మధ్యాహ్న భోజన కార్మికురాలిని విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.