Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం!
By: Tupaki Desk | 20 Dec 2022 8:30 AM GMTపశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు పెను ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో కార్‌లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే ఎలీజాకు ప్రమాదం తప్పింది.
కాగా ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే ఎలీజా, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం మరొక కారులో జంగారెడ్డిగూడెం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే కుటుంబం చేరుకుంది.
కాగా ఈ ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్యే ఎలీజా తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి కారులో జంగారెడ్డిగూడెం వెళ్తుండగా కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కాగా 2019 ఎన్నికల్లో తొలిసారి వీఆర్ ఎలీజా చింతలపూడి నుంచి పోటీ చేశారు. ౖ వైసీపీ నుంచి బరిలోకి దిగిన ఆయన 1,15,755 ఓట్లను సాధించారు. ఇక టీడీపీ అభ్యర్థి కర్రా రాజారావుకు 79,580 ఓట్లు వచ్చాయి. దీంతో ఎలీజా 36,175 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి సైతం హాజరయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.