Begin typing your search above and press return to search.
నగరి.. ఫైర్ బ్రాండ్ ఇక పక్కా లోకల్!
By: Tupaki Desk | 27 Aug 2018 6:33 AM GMTఏపీ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన నగరి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇప్పుడు నగరి వాసి కానున్నారు. ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆమెకు నగరిలో సొంత ఇల్లు లేకపోవటంతో ఆమెను లోకల్ కాదన్న పేరుతో విమర్శలు సంధిస్తుంటారు. తాజాగా ఆ తరహా విమర్శలకు చెక్ పెట్టటంతో పాటు.. నగరి వాసిగా తనను తాను మార్చుకునేందుకు సిద్ధపడ్డారు.
నగరి పట్టణంలో ఆమె ఒక ఇంటిని కట్టుకున్నారు. హైదరాబాద్ లో సొంతిల్లు ఉన్న రోజాకు నగరి ఎమ్మెల్యే అయినా సొంతిల్లు ఇప్పటివరకు లేదు. చిత్తూరు జిల్లా భాకరాపేట సమీప గ్రామంలో పుట్టిన ఆమె విద్యాభాస్యం ఎక్కువగా తిరుపతిలోనే జరిగింది. రోజా అసలు పేరు శ్రీలత. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆశీస్సులతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తన పేరును రోజాగా మార్చుకుంది. తన తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించిన రోజా.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె తొలుత 1999లో టీడీపీలో చేరారు. ఏ అంశం మీదనైనా ధాటిగా మాట్లాడతారన్న పేరున్న ఆమె.. 2009లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి నాటి మంత్రిగా వ్యవహరిస్తున్న గల్లా అరుణకుమారిపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమె కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి మాజీ మంత్రి.. దివంగత సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో.. ఆమె ఎమ్మెల్యే కావాలన్న కల నెరవేరింది. ఓపక్క సినిమాలు.. మరోవైపు టీవీ షోలు చేసే ఆమెను రాజకీయ ప్రత్యర్థులు ఇరుకున పెట్టేలా విమర్శలు చేసినా.. వాటిని ధీటుగా ఎదుర్కొంటూ తన మాటలతో ఘాటుగా బదులిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. నగరి ఎమ్మెల్యే అయినా.. అక్కడ సొంత ఇల్లు లేకపోవటాన్ని రాజకీయ ప్రత్యర్థులు తరచూ ప్రస్తావిస్తూ.. ఆమెను విమర్శిస్తూ ఉంటారు.
దీనికి చెక్ పెట్టే పనిలో ఆగంగా తాజాగా నగరిలోని కొండచుట్టు మండపం వద్ద సొంతింటిని నిర్మించుకున్నారు. ఈ ఇంట్లోఈ నెల 30న గృహప్రవేశం చేయనున్నారు. దీంతో.. ఇప్పటిదాకా లోకల్ కాదనే వారి నోళ్లకు చెక్ పడనుంది. నగరిలో రోజా పక్కా లోకల్ కానున్నారన్న మాట.