Begin typing your search above and press return to search.
పసుపు కుంకుమ కాదు.. బాబుకు ఉప్పుకారం రాశారు
By: Tupaki Desk | 25 May 2019 8:58 AM GMTఎన్నికల ఫలితాల వచ్చే వరకూ నోరు విప్పకుండా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తాజాగా టీడీపీ అధినేతపైనా.. నేతలపైనా ఫైర్ అయ్యారు. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా విమర్శల వర్షం కురిపించారు. తనను ఐరెన్ లెగ్ అంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేతలకు పంచ్ లు ఇస్తూ.. తనది గోల్డెన్ లెగ్ గా ఆమె చెప్పుకున్నారు.
టీడీపీకి చెందిన కొందరు వెధవలు అసెంబ్లీ బయట కూసిన కూతలకు ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసిన ఆమె.. తన ఉసురు చంద్రబాబుకు తగిలిందన్నారు. నగరి బరిలో దిగిన తనను ఓడించేందుకు చంద్రబాబు చాలానే కుట్రలు చేశారని.. కానీ ప్రజలు మాత్రం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నగరికి ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయానన్న ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. బాబు ప్రభుత్వంలో నగరికి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు.
తాజాగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో నగరి పట్టణంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని చెప్పారు. రాజన్న రాజ్యం వచ్చిందని.. ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పారు. కాల్ మనీ.. సెక్స్ రాకెట్ అంశాల మీద అసెంబ్లీలో తాను పోరాడితే .. దాదాపు ఏడాది పాటు తనను సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
తనను ఎంతగానో చిత్రహింసలు పెట్టారని.. అందుకే చంద్రబాబు పార్టీ భూస్థాపితం కానుందన్నారు. మహిళా సాధికారిత సమావేశానికి ఆహ్వానించి 24 గంటల పాటు తనను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో ప్రజలకు తెలుసన్నారు. పసుపుకుంకుమ పథకంలో లబ్థి పొందిన మహిళలు చంద్రబాబుకు ఉప్పుకారం రాశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ప్రజలిచ్చిన తీర్పు చంద్రబాబు అండ్ కోకు చెంపపెట్టులాంటిదని ఆమె మండిపడ్డారు.