Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే రోజా విమానానికి ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు
By: Tupaki Desk | 14 Dec 2021 9:35 AM GMTవైసీపీ ఫైర్ బ్రాండ్ , ఎమ్మెల్యే రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానం రాజమండ్రినుంచి తిరుపతి రావాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా ఎక్కిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం తిరుపతికి ఉదయం 10.55 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని బెంగళూరువైపు మళ్లించాడు.అక్కడ సేఫ్ గా ల్యాండ్ చేశారు.
విమానంలో ఎమ్మెల్యే రోజాతోపాటు 70మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ హాఠాత్ పరిణామంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ విమాన ప్రమాదంపై ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇంకా విమానంలోనే ఉన్నాం.. విమానం డోర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. పైలెట్ కు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు’ అని రోజా ఓ వీడియోను విడుదల చేశారు.