Begin typing your search above and press return to search.

విశాఖ టూర్ : ఎమ్మెల్యేగా ఆమెను ఫిక్స్ చేసిన జగన్...?

By:  Tupaki Desk   |   16 July 2022 2:30 AM GMT
విశాఖ టూర్ : ఎమ్మెల్యేగా ఆమెను ఫిక్స్ చేసిన జగన్...?
X
జగన్ మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. విశాఖ టూర్ లో ఆయన ఎక్కువగా మాట్లాడింది మహిళా ప్రజాప్రతినిధులతోనే. ఆయనకు స్వాగతం పలడానికి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇక జగన్ ఎమెల్సీ వరుడు కళ్యాణితో చాలా సేపు మాట్లాడారు, ఆమె చెప్పినది చెవిపెట్టి మరీ విన్నారు. అలాగె మిగిలిన మహిళా ప్రతినిధులకు కూడా టైమ్ ఇచ్చి వారు చెప్పినది ఆసక్తిగా విన్నారు.

ఆ తరువాత వేదిక మీద ఆయన ఏకంగా విశాఖ తూర్పు నియోజకవర్గానికి వరాలు ఇచ్చేశారు. విశాఖ తూర్పు ఇంచార్జిగా వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల ఉన్నారు. ఆమె 2019 ఎన్నికల్లో చివరి నిముషంలో పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు మెజారిటీని బాగా తగ్గించగలిగారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆమెతో పాటు మేయర్ హరి వెంకటకుమారి ఇంకా మరికొందరు ఆశిస్తున్నారు.

అయితే జగన్ తాజా టూర్ లో తూర్పు టికెట్ లో ఏ మార్పు లేదని విజయనిర్మలకు అది దక్కడం ఖాయమని తేటతెల్లమైంది. సీఎం కి విజయనిర్మల నియోజకవర్గం సమస్యలను అన్నీ ప్రస్థావించి నివేదిక ఇచ్చారు.

దాన్ని చూసి అక్కడికక్కడే విశాఖకు అవసరం అయిన మూడవ ఫ్లై ఓవర్ ని సీఎం విశాఖ తూర్పునకు మంజూరు చేశారు. అలాగే విశాఖ తూర్పులో అండర్ డ్రైజేనికి పాతిక కోట్లు కేటాయించారు. జోడుగుళ్ళపాలెంలో మత్య్సకారులకు షెడ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చారు.

ఇలా ఒకేసారి చెప్పినవి అన్నీ చేస్తూ సీఎం నిధుల వరద పారించడం తో విజయనిర్మల ఆనందానికి అవధులు లేవు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతాయని అంటున్నారు. ఆమె ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గం ఇంచార్జిగా వీఎమ్మార్డీయే చైర్మన్ గా అధికార హడావుడి చేస్తున్నారు. ఇపుడు వీటితో ఆమె జనాలలోకి వెళ్లడానికి మరింత అవకాశం లభించింది అంటున్నారు.

ఇంకో వైపు విజయనిర్మలకు వైసీపీ టికెట్ కంఫర్మ్అంటున్నారు. అందుకే ఆమె చెప్పిన వాటిని ఆయన ఓకే చేశారు అని చెబుతున్నారు. మొత్తానికి జగన్ తూర్పులో ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆమెనే ఫిక్స్ చేశారు అని వైసీపీలో అంతా అనుకుంటున్నారు. అదే కనుక ఫిక్స్ అయితే పార్టీలోని ఆశావహులు మిగిలిన వారు సర్దుకోకతప్పదు, ఇక టీడీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారో కూడా ఇప్పటినుంచే చూసుకోవాల్సిందే.