Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యేల్లో.. బన్నీ కంటే.. బాలయ్య ఫ్యాన్స్ ఎక్కవా?
By: Tupaki Desk | 21 Dec 2021 8:46 AM GMTఏపీ అధికార పార్టీ వైసీపీ లో సినిమాలంటే చెవి కోసుకునేవారు చాలా మంది ఉన్నారని అంటున్నారు నెటి జన్లు. మరి కొందరు సినిమా తీసే వారు కూడా ఉన్నారు. ఇంకొందరు సినిమాలో నటించే వారు కూడా ఉన్నారు. ఇక, వచ్చిన సినిమా వచ్చినట్టు చూసే వారు కూడా కోకొల్లలేనట! ఈ విషయం ఇటు పార్టీలోనూ.. అటు బయట కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇటీవల కొద్ది రోజుల గ్యాప్ తో రెండు మూవీలు వచ్చాయి. వీటి లో ఒకటి బన్నీ నటించిన పుష్ప. రెండు నందమూరి బాలయ్య నటించిన అఖండ. ఈ రెండు మూవీలకు మంచి టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. ఏపీకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. పనిగట్టుకుని ఈ రెండు మూవీలను వీక్షించారు. పైగా కొందరు హైదరాబాద్ కు కూడా వెళ్లి.. ప్రీమియర్ షోలనే చూసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఇక్కడ చిత్రమైన విషయం హల్చల్ చేస్తోంది.
అదేంటంటే.. బన్నీ మూవీ కన్నా కూడా.. బాలయ్య మూవీ అఖండ ను ఎక్కువ మంది వైసీపీ నాయకులు వీక్షించారని అంటున్నారు. అదేంటి? అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది చిత్రం! వాస్తవానికి బాలయ్య మూవీ ని వైసీపీ నేతలు చూడరని అందరూ అనుకున్నారు ఎందుకంటే.. ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకుడు.
పైగా చంద్రబాబు వియ్యంకుడు. అదీకాక.. అసెంబ్లీ ఘటన నేపథ్యంలో వైసీపీ నేతలకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు బాలయ్య. ఇక, అఖండ రిలీజ్‌కు ముందే.. రాష్ట్రంలో సినిమా టికెట్ల పై వివాదం రేగింది. ఆన్‌లైన్ టికెట్లను విక్రయించడంతోపాటు.. టికెట్ ధరలను కూడా తగ్గించారు. దీంతో బాలయ్య పై కసి తోనే ఇలా చేశారని ప్రచారం జరిగింది.
ఇక, వైసీపీ నాయకులు కూడా ఈ మూవీని చూడరనేచర్చ జరిగింది. తీరా.. ఇప్పుడు వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది అఖండమూవీని ఒకటికి రెండు సార్లు చూశారని అంటున్నారు.
బన్నీ మూవీ పుష్ప కంటే కూడా ఎక్కువ గా .. అఖండ కే వైసీపీ ఎమ్మెల్యేలు జై కొట్టారట. నిజానికి ఈ విషయం లో టీడీపీ నాయకులు(ఎందుకంటే.. టీడీపీ ఎమ్మెల్యే నటించిన మూవీ) అఖండ మూవీని చాలా మంది చూడలేదట. పైగా కొందరు తర్వాత చూద్దాంలే అనుకున్నారట. కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ మూవీని పదేపదే వీక్షించారట.
పైగా. ఈ మూవీ లో డైలాగులు కూడా బాగున్నాయని.. ఉత్తరాంధ్ర, విజయవాడలకు చెందిన ఇద్దరు మంత్రులు కితాబు నివ్వడం.. గమనార్హం. మరి వీరికి బాలయ్య పై అభిమానం తో చూశారో.. లేక.. బాలయ్యంటే.. సీఎం జగన్ కు అభిమానం కాబట్టి..ఆయనను మచ్చిక చేసుకునేందుకు చూశారో.. తెలియాల్సి ఉంది!