Begin typing your search above and press return to search.

మేం గ్రామాల్లో తిర‌గ‌లేం.. మేం ఏం చేశాం.. వైసీపీ ఎమ్మెల్యేల ఆవేద‌న‌!

By:  Tupaki Desk   |   20 Dec 2021 12:30 PM GMT
మేం గ్రామాల్లో తిర‌గ‌లేం.. మేం ఏం చేశాం.. వైసీపీ ఎమ్మెల్యేల ఆవేద‌న‌!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక విష‌యం తీవ్ర ఆవేద‌న‌కు అంత‌కు మించిన ఆందోళ‌న‌కుదారితీస్తోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు.. గ్రామాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు!. మేం ఏం చేశామ‌ని.. గ్రామాల్లోకి వెళ్తాం.. మేం వెళ్లలేం! అంటూ.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు? అంటే.. కీల‌క‌మైన అంశాల‌ను వారు తెర‌మీదికి తెస్తున్నారు. అవేంటంటే.. ఎన్నొఆశ‌ల‌తో .. గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఇచ్చారు.

నిజానికి గెలుస్తామా? అనుకున్న ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను కూడా భారీ మెజారిటీతో గ్రామాల్లో ప్ర‌జ‌లు గెలిపిం చారు. ఆ ఎన్న‌కల్లో ప్ర‌చారం చేసిన వైసీపీ నాయ‌కులు ప్ర‌ధానంగా వైఎస్ బొమ్మ‌తోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. జ‌గ‌న్ సీఎం అయితే.. రాష్ట్రంలో వైఎస్ ప‌రిపాల‌న వ‌స్తుంద‌ని.. రాజ‌న్న రాజ్యం కొలువుదీరుతుంద‌ని.. చెప్పారు. దీంతో ప్ర‌జ‌లు అంద‌రూ కూడా .. రాజ‌న్న రాజ్యం వ‌స్తుంది. త‌మ గ్రామాలు భారీ ఎత్తున డెవ‌ల‌ప్ అవుతాయ‌ని న‌మ్మారు. ఈ క్ర‌మంలోనే వైసీపీకి అండ‌గా ఉన్నారు. ఎవ‌రికి టికెట్ ఇచ్చినా.. వైఎస్ మొహం చూసి.. గెలిపించారు.

మ‌రీ ముఖ్యంగా వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు న‌వ‌ర‌త్నాల కంటే కూడా రాజ‌న్న రాజ్యం అనే నినాదా నికే మొగ్గు చూపించారు. దీనివ‌ల్ల త‌మ గ్రామాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని ఆశించారు. అయితే.. వైసీపీ ప్ర‌బుత్వం వ‌చ్చి రెండున్న‌రేళ్లు దాటిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామాల్లో ఎలాంటి అభి వృద్ధి జ‌ర‌గ‌లేదు. పైగా ఎక్క‌డా ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకువెళ్ల‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి ప‌రిస్థితి ఉందో.. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి ఉంది. ఇది .. వైసీపీ ఎమ్మెల్యేల‌కు మొహం చూపించ‌లేని ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది.

పైగా న‌వ‌ర‌త్నాలు ఇస్తున్నా కూడా ప్ర‌జ‌లు మాత్రం అభివృద్ధినే ప్ర‌శ్నిస్తున్నారు. మీరు మాకు ఏం చేశారు? అని ఎమ్మెల్యేల‌ను నిల‌దీస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పోనీ.. మీకు న‌వ‌రత్నాలు ఇస్తున్నాం.. క‌దా.. అని చెబుదామంటే.. ఎవ‌రికి ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి చేకూరిందో వివ‌రించి చెప్పేందుకు.. ఎమ్మెల్యేల ద‌గ్గ‌ర ఎలాంటి డేటా లేదు. అంతా కూడా.. వ‌లంటీర్ల చేతుల్లోనే ఉంది. దీంతో ప్ర‌జ‌లు అడుగుతున్న ప్ర‌శ్న‌లకు వారు నీళ్లు మ‌లుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న పరిస్థితిని తీసుకుంటే.. రోడ్లు లేవు.. నీళ్లు లేవు.. భారీ ప్రాజెక్టులు అస‌లే లేవు.. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయి. అని గ్రామీణులు అంటున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. పంచాయ‌తీల‌కు కేంద్రం ఇస్తున్న నిధుల‌కు రాష్ట్ర ప్ర‌ష‌భుత్వం త‌న వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వ‌డం ప‌క్క‌న‌పెట్టి.. కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా వాడేసుకోవ‌డంపై గ్రామీణులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. పోనీ.. నాడు-నేడు అనే ప‌థ‌కం కింద ప‌నులు చేప‌ట్టినా.. కాంట్రాక్ట‌ర్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో.. ఆ ప‌నులు కూడా ముందుకు సాగ‌డం లేదు. దీంతో గ్రామీణులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు గ్రామాల్లో అడుగు పెట్టాలంటేనే హ‌డ‌లి పోతున్నారు. చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. ఇప్పుడు తిరిగితే.. ప్ర‌జ‌లు త‌మ‌పై తిర‌గ‌బ‌డ‌డం ఖాయ‌మ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.