Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యేలు జిల్లాలో మాట్లాడుకోవడం లేదా.. ఎందుకు?
By: Tupaki Desk | 15 May 2021 10:52 AM GMTముందుగా మురిస్తే పండుగ కాదన్నట్టుగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి మారింది. జగన్ సామాజిక కోణం అని చెప్పి సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం ఇప్పుడు ఆ పార్టీలో విచిత్రమైన పరిస్థితిని తెచ్చిపెట్టినట్టైందని చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు జిల్లాల్లో అస్సలు మాట్లాడుకోవడం లేదట.. ఆ కథేంటి? కమామీషూ ఏంటో తెలుసుకుందాం..
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఏకంగా 151మంది ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ విజయం సాధించారు. తిరుగులేని మెజార్టీతో ఏపీ సీఎం కుర్చీలో కూర్చున్నాడు. అయితే రెడ్డి సామాజికవర్గానికి జగన్ గద్దెనెక్కితే అంతా వారివాల్లే ఉంటారనుకున్నారు. కానీ జగన్ మాత్రం సామాజికన్యాయం చేశాడు. మంత్రివర్గాన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు పెద్దపీట వేసి సామాజిక న్యాయం చేశాడు.
అయితే జగన్ మంత్రివర్గ ఏర్పాటు సమయంలోనే ఈ కేబినెట్ పదవీకాలం రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని తెలిపారు. 90శాతం మందిని మార్చి రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో రెడ్డి, ఇతర ఆశావహులు నాడు గమ్మున ఊరుకున్న పరిస్థితి.
90శాతం మంత్రులందరినీ మార్చేస్తే తమకు అవకాశం వస్తుందని .. ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి తమదేనని ఎవరి లెక్కలు వారు ఇప్పటికే వేసుకుంటున్నారు. ఇందులో సీనియర్లు అయిన రోజా, అంబటి రాంబాబు లాంటి వారు ఉన్నారు.
అనామకులు ఎందరికో జగన్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించారు. సామాజిక కోణంలో చాలా మందిని మంత్రులుగా చేశారు. అందుకే ఇప్పుడు వారంతా కూడా మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. నాకే మంత్రి పదవి అంటే నాకు అంటూ ఎమ్మెల్యేలు సైతం జిల్లాల్లో సరిగా మాట్లాడుకోవడం లేదట.. జగన్ చెప్పిన రెండున్నర సంవత్సరాలు పూర్తి కావాల్సి వస్తుండడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా మంత్రి పదవుల పల్లకీలో ఊరేగుతున్నారట..
ఇక ప్రజలకు సరిగ్గా సేవలు అందించక ఎమ్మెల్యేలు మాట్లాడుకోక ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రజలు అనుకుంటున్నారు. ముందు మమ్మలను పట్టించుకోండి అని పలువురు అంటున్నారు. జగన్ ఇచ్చిన హామీతో అస్సలు ఎమ్మెల్యేలు పనులు చేయకుండా తయారయ్యారని.. ఇలానే వ్యవహరిస్తే అంతిమంగా వైసీపీకే పెద్ద దెబ్బ అని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి ఆశలు వీడి మాట్లాడుకొని ప్రజలకు పనిచేయాలని పలువురు సూచిస్తున్నారు.