Begin typing your search above and press return to search.
కల్తీ మద్యం కేసులో అసలు మర్మం ఇదా?
By: Tupaki Desk | 30 Oct 2016 9:24 AM GMTనెల్లూరు జిల్లాలో కల్తీ మద్యం కేసు - ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాత్రపై సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారనే వార్తలపై కొత్త చర్చ జరుగుతోంది. ఈ దర్యాప్తు వెనుక రాజకీయ కక్ష ఉందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో టీడీపీ-వైసీపీల మధ్య అన్ని విషయాల్లోనూ విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ మాటల యుద్ధం చివరకు వైకాపా ఎమ్మెల్యేలపై సీఐడీ అధికారులు కల్తీ మద్యం కేసులో చార్జిషీట్ దాఖలు చేశారనే సమాచారంతో మరింత రాజుకుంది. గతంలో టీడీపీలోకి కాకాణి - రామిరెడ్డిలిద్దరూ చేరబోతున్నట్లు వార్తలు జిల్లావ్యాప్తంగా దావానలంలా వ్యాపించాయి. అయితే వారు వైకాపాను వీడకపోవడంతోనే వారిపై కక్ష సాధింంపు చర్యలకు దిగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారి అనుచరులు ఆరోపిస్తున్నారు. కేసును విచారించడం కంటే... రాజకీయంగా పగ తీర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.
వాస్తవానికి రెండున్నరేళ్లుగా నడుస్తున్న ఈ కల్తీ మద్యం కేసు ఇప్పుడు జిల్లాలో వాదోపవాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సర్వేపల్లి నియోజకవర్గం వేదికగా జిల్లాకు చెందిన టీడీపీ- వైకాపా నేతల మధ్య అనాగారిక భాషతో కూడిన యుద్ధం జరుగుతోంది. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు. కల్తీ మద్యం కేసుకు సంబంధించి చార్జ్ షీట్ లో పేర్లున్న ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ ఏప్రిల్ నెలలోనే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకోవడం కూడా జరిగింది. జిల్లావాసులు దాదాపు మర్చిపోయిన కేసును మళ్లీ ప్రసార మాధ్యమాల్లో కనిపించడం, అదీ కూడా వైకాపా జిల్లా అధ్యక్షుడు - సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి - టీడీపీ సీనియర్ నేత - ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలతో పాటు వారివురి అనుచరుల నడుమ గత వారం రోజులుగా తీవ్ర వాదోపవాలు - పరుషపదజాలంతో పరస్పర విమర్శలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం టీడీపీ నేతలు - రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలేనని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీ నేతలను విమర్శించేందుకు సందర్భాలు అవసరం లేదనేది టీడీపీ నేతల వాదనగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నా - అధికారపక్షంలో ఉన్నా విమర్శల సమయంలో పదునైన పదాలు వాడడం మినహాయించి అనాగరిక - పరుషపదజాలం వాడడం అలవాటు లేని నేతలుగా సోమిరెడ్డికి - కాకాణికి జిల్లాలో పేరుంది.
అటువంటివారు కూడా ఈసారి కాస్త ఘాటైన భాషను ఉపయోగించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేవలం తమ నియోజకవర్గ పరిధిలో కల్తీ మద్యం దొరికిందనే కారణం మినహాయించి, తమపై నమోదు చేసిన కేసులో సీఐడీ అధికారులు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందే తప్ప అందులో తమ ప్రభుత్వ ప్రమేయం ఎంతమాత్రం లేదనేది జిల్లా టీడీపీ నేతలు వాదనగా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/