Begin typing your search above and press return to search.
కొత్త ట్రెండ్ - అమ్మా నేను బాగానే పనిచేస్తున్నానని చెప్పవా.
By: Tupaki Desk | 14 Oct 2022 2:30 PM GMTవైసీపీ ఎమ్మెల్యేలకు జడుపు, జ్వరం పట్టుకుందట. పార్టీ అధిష్టానం చేయిస్తున్న వరసు సర్వేలతో వారు బెంబేలెత్తుతున్నారు. గడప గడపకు తిరిగే వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ చెప్పా రు. సరేలే అనుకున్న సగంమందికిపైగా ఎమ్మెల్యేలు.. ప్రజల వద్దకు చేరుతున్నారు. వారి కష్టాలు తెలు సు కుంటున్నారు. ఇంకేముంది.. మూడు సంవత్సరాల తర్వాత.. కనిపిస్తున్న ఎమ్మెల్యేలకు.. ప్రజలు తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు.
పోనీ.. ఇక్కడితో అయిపోయిందిలే.. ఇంకేముంది.. మనకు సీటు ఖాయం అనుకున్నారట ఎమ్మెల్యేలు. కానీ.. వెంటనే రియాక్ట్ అయిన.. పార్టీ అధిష్టానం.. మీరేదో.. మొక్కుబడిగా తిరుగుతున్నారు. అలా కాదు.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్టు వివరించాలి. అదేసమయం లో మీరు బాగా పనిచేస్తున్నారని.. ప్రజలు కూడా భావించాలి.. అని పెద్ద షరతు పెట్టారట. ఈ పరిణామం తో నేతలకు చెమటలు పట్టాయి.
ప్రజల మధ్యకు వెళ్లమన్నారు వెళ్తున్నాం.. కానీ, మేం బాగా పనిచేస్తోందీ.. లేనిదీ తెలియాలంటే.. ప్రజల కష్ట సుఖాలు చూడాలి కదా.. వాళ్లేమో.. రోడ్లులేవు.. ఉద్యోగాలు లేవని.. చెబుతున్నారు.
మరి ఇవన్నీ చేయాలంటే.. మాకు చేతినిండా డబ్బులు ఉండాలి కదా! ఇవ్వండి!! అని తేల్చి చెప్పారట. దీనికి అధిష్టానం నుంచి ఘాటు రిప్లయి వచ్చినట్టు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య చర్చ సాగుతోంది. అదే వుంటే.. మీరెందుకు మేం చేయలేమా? మార్కులు వేయించలేమా? అని!
వెరసి.. మొత్తంగా.. ఏం చేసినా.. చేయకున్నా.. ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ రావాలని.. ఎమ్మెల్యేలు మా ర్కులు వేయించుకోవాలని.. మరో సారి సర్వేలో ఈ రెండు విషయాలనే కీలకంగా తీసుకుంటామని.. క్షేత్రస్తాయిలో ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి సమాచారం చేరిపోయిందట.
దీంతో ఇప్పుడు చేసేది లేక.. ప్రజల వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యేలు.. సంక్షేమపథకాల గురించి వివరిస్తూనే.. చివరలో ''మనలో మన మాట'' అంటూ.. మేం బాగా పనిచేస్తున్నామని..చెప్పాలని.. బ్రతిమాలుకుంటున్నారట. అంటే.. సర్వే పేరుతో ఎవరైనా వచ్చి అడిగితే.. ఏం చెప్పాలో ఎమ్మెల్యేలే చెప్పేస్తున్నారన్నమాట. మరి ప్రజలు ఏం చెబుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.