Begin typing your search above and press return to search.
వ్యతిరేకతను పసిగట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు.. అందుకే ఇలా చేస్తున్నారా?
By: Tupaki Desk | 7 March 2022 5:34 AM GMTఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు తమపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించారా? ఈ క్రమంలోనే ప్రజలను శాంత పరిచేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెలు ప్రజాయాత్రల బాట పట్టారు.
ఇప్పటికి పార్టీ అధికా రంలోకి వచ్చి మూడేళ్లు అయిపోతోంది. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సెగలు పుడుతు న్నాయి. ప్రబుత్వం తరఫున ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నా.. నియోజకవర్గాల్లో అభివృద్ధి ఉండడం లేదనే వాదన వినిపిస్తోంది.
ఈ ఆవేదన దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఉంది. అయితే.. దీంతోపాటు.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. నేతలపై నేరుగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే.. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చక్రం తిప్పు తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. ప్రజలకు నేరుగా చేరువయ్యేందుకు, వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే నేతలు.. వివిధ పేర్లతో ప్రజలను కలుసుకుని.. పాజిటివిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా.. `మీతో మీ ఎమ్మెల్యే` అనే పేరుతో వీలు కుదిరినప్పడల్లా.. ప్రజల మధ్యకు వెళ్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అంతేకాదు.. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ.. ప్రజలకు చెబుతున్నారు. అయితే.. దీనిని కొందరు నేతలు తప్పు పడుతున్నారు. ఇక, ఇదే జిల్లాలోని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడకు కూడా అసంతృప్తి సెగ బాగానే తగులుతోంది.
దీంతో ఆయన `గడపగడపకు మీ ఎమ్మెల్యే` పేరుతో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ.. గౌడకు మాత్రం వ్యతిరేకత తగులుతూనే ఉంది. ఆయన చేస్తున్న పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు తగులుతున్నాయి.తమకు అన్యాయం చేశారంటూ.. కొందరు వలంటీర్లు ఇటీవల యాత్రకు అడ్డు తగిలారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కి కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
చంద్రబాబు కుటుంబాన్ని ఆయన దూషించారంటూ..ఇప్పటికీ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. దీంతో ఆయన కూడా ఈ వ్యతిరేకతను తప్పించుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు. కాకినాడ నుంచి సింహాచలం వరకు పేరుతో చేస్తున్న యాత్ర ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.