Begin typing your search above and press return to search.
వైసిపి హైకమాండ్ మీద ఎదురు తిరిగినా వైసిపి ఎమ్మెల్యే లు వీళ్లేనా
By: Tupaki Desk | 11 Nov 2020 11:50 AM GMTఇదో కొత్త పరిణామంగా చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఏపీ అధికారపక్షంలోచోటు చేసుకున్న సీన్ ఆసక్తికరంగా మారింది. ఇలాంటివి సాధ్యమేనా? అన్న ఆశ్చర్యం పలువురిని వెంటాడుతోంది. అధినేతకు నీడలా.. ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఎంపీ కమ్ పార్టీలో అన్ని తానై అన్నట్లు వ్యవహరించే విజయసాయిని టార్గెట్ చేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడా పార్టీ సమావేశంలో కాకుండా.. బహిరంగంగా జరిగిన డీడీఆర్ సీ సమావేశంలో కావటం గమనార్హం.
విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో విజయసాయికి.. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మధ్య నేరుగా సాగిన మాటల యుద్ధం ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది. తాము నిజాయితీపరులమే అంటూ ధర్మశ్రీ చెప్పుకురావాల్సి రావటం ఒక ఎత్తు అయితే.. దీనికి భిన్నమైన వ్యాఖ్యలు విజయసాయి నోటి నుంచి వచ్చాయి. అనందపురం మండలం పాలవలసలో మాజీ సైనికుడికి చెందిన భూమిని ధర్మశ్రీతో పాటు.. మరికొందరు కొనుగోలు చేసినట్లుగా చెబుతారు. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగతోంది. ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్ శాఖపై ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి.
డీడీఆర్సీ సమావేశంలో ఈ భూముల గురించి రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఈ అంశాల్ని నర్మగర్భంగా ప్రస్తావించారు దీనికి కారణం లేకపోలేదు. ఈ భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సిన ఎన్ వోసీ నిలిచిపోయింది. ఈ అంశాల్ని పరోక్షంగా గుర్తు చేసేలా విజయసాయి వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఆక్రమణ వెనుక రాజకీయ నేతలు ఉంటున్నారన్నారు.
గుమ్మడికాయ దొంగలు ఎవరంటే.. భుజాలు తడుముకున్న రీతిలో విజయసాయి మాటలకు ధర్మశ్రీ అభ్యంతరం చెబుతూ.. పదే పదే రాజకీయ నేతలు అనటం బాగోలేదని.. తాము కూడా నిజాయితీపరులమేనని.. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో ఇష్టమని పేర్కొనటం గమనార్హం. ఓవైపు జగన్ కు అత్యంత సన్నిహితుడి మాటల్ని తప్పు పడుతూనే.. జగన్ తమకు ఇష్టమని చెప్పటం చూస్తే.. ధర్మశ్రీ తన రాజకీయ చతురతను ప్రదర్శించారని చెప్పాలి.
సదరు భూముల విషయంలో చట్టబద్ధత లేకుంటే విచారణ జరిపించాలే కానీ.. ఇలా ప్రతిసారీ రాజకీయ నేతలు అంటూ ప్రస్తావించటం బాగోలేదన్నారు. తానుకొన్న భూమి అక్రమంగా కొన్నట్లుగా నిరూపిస్తే.. వదిలేయటానికి తాను సిద్ధమన్నారు. ఇలా విజయసాయిని ఉద్దేశించి ధర్మశ్రీ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కారణం.. ఇప్పటివరకు అలాంటి సాహసం ఇంతకు ముందు వరకు ఎవరు చేయకపోవటమే. ఇప్పటివరకు విజయసాయి మాటకు ఎదురుచెప్పేందుకు సైతం ఇష్టపడని నేతల తీరుకు భిన్నంగా ఇప్పుడు మాట్లాడటం.. వాదనకు దిగటం వరకు రావటాన్ని అధినేత జగన్ సీరియస్ గా తీసుకోవాలంటున్నారు. ఇలాంటి వాటిని వెనువెంటనే సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.