Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్సీ.. టెర్రరిస్టు నినాదం!
By: Tupaki Desk | 31 May 2022 4:30 AM GMTవైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా వారికి అర్ధం కావడం లేదు. ఎవరికి వారు.. అధినేతను మచ్చిక చేసుకుని పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమం లో ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు, బూతులతో విరుచుకుపడడం, జగన్ ను ఎవరైనా ఏమైనా అంటే.. చంపేస్తామని, లేదా.. తామే ఆత్మాహుతి బాంబర్‌లుగా మారుతామని.. ఇటీవల కాలంలో ప్రకటనలు చేస్తున్న నాయకులు పెరుగుతున్నారు. ఇలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ కూడా చేరారు.
వైసీపీ ఎమ్మెల్సీ.. దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. పూనకం వచ్చిన వ్యక్తిగా ఊగిపోయారు. ప్రతిపక్ష నాయ కుడు... టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడపై విరుచుకుపడ్డారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట తూలారు. అంతేకాదు.. అదేసమయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌పై ఎనలేని అభిమానం చూపిస్తూ.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం.. ఆత్మాహుతి సభ్యుడిగా మారుతానంటూ.. దువ్వాడ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
అచ్చెన్నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులంతా వారి నోళ్లను అదుపులో పెట్టుకోవాలని, అలా కాకుండా సీఎం జగన్ జోలికి ఎవరైనా వస్తే ఆత్మాహుతి దళంగా మారుతానని దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమె త్తారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్ జంక్షన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. సీఎం జగన్‌పై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరో దిక్కులేక అచ్చెన్నాయుడును పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే టెక్కలి నియోజకవర్గం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్‌సీపీ నాయకుల అంతు చూస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.
టీడీపీ దృష్టిలో అధికారం అంటే అంతు చూడటం అని మరోసారి ఆ పార్టీ నాయకులే అంగీకరించారని చురకలంటించారు. కేవలం సీఎం వైఎస్ జగన్‌ను, ప్రభుత్వాన్ని విమర్శించేందుకే మహానాడును నిర్వహించారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఏ ప్రయోజనం చేకూర్చారో మహానాడులో ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. టీడీపీ మహిళా కార్యకర్తలతో తొడలు కొట్టించటం చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుందన్నారు.
సీఎం జగన్ స్పష్టంగా సింగిల్ పేజీ మేనిఫెస్టోతో ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి సైతం కేంద్ర బృందాలు వస్తుండటం సీఎం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా కొనసాగుతోందని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.
''అరే దున్నపోతు నిన్ను తన్నాలంటే మాకు ఒక నిమిషం పట్టదు. ఈ రోజు చెబుతున్నా.. ఆహుతి సినిమాలో విలన్‌ను ఎలాగైతే ఈడ్చిఈడ్చి కొట్టారో అలాగే నిన్ను కూడా ఈ టెక్కలి రోడ్లపై ఈడ్చిఈడ్చి, దొర్లించి దొర్లించి కొట్టకపోతే ఐ యామ్ నాట్ దువ్వాడ శ్రీనివాస్ (మీసాలు మెలేస్తూ)..'' అంటూ అచ్చెన్నా యుడుపై ఎమ్మెల్సీ దువ్వాడ పరుష పదజాలంతో రెచ్చిపోయారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి గురించి గానీ, వైసీపీ నాయకుల గురించిగానీ మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు.
'అచ్చెన్నాయుడూ.. నిన్ను రాజకీయంగా పతనం చేయడమే నా లక్ష్యం' అంటూ తిట్టిపోశారు. ''చట్నీ నా కొడకా.. దిక్కుమాలిన దున్నుపోతు నా కొడకా.. నువ్వురా మాట్లాడుతావు.. నువ్వురా 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయంటావు.. నువ్వురా జగన్మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతావు.. పార్టీ లేదు.. బొక్కాలేదు.. అని లాడ్జీ గదుల్లో చెబుతావు, లాడ్జీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోసం చేస్తావు.
ఆ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీకి, దొంగల పార్టీకి గతిలేక నిన్ను అధ్యక్షుడ్ని చేశారు. ఇంకోసారి జగన్మోహన్‌రెడ్డిపై మాట్లాడితే.. నీ తాట తీస్తా జాగ్రత్త. ఒరేయ్ దున్నపోతా మాకు అధికారాలతో పనిలేదురా.. పదేళ్ల క్రితమే నిన్ను గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించా. ఈ రోజుకి కూడా వడ్డితాండ్ర, ఆకాశలక్కవరం గ్రామాల్లో నువ్వు అడుగుపెట్టలేవు'' అంటూ దువ్వాడ హెచ్చరించారు.