Begin typing your search above and press return to search.

దేశంలో రెండో రిచెస్ట్ రాజ్యసభ ఎంపీగా వైసీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   23 July 2020 9:50 AM GMT
దేశంలో రెండో రిచెస్ట్ రాజ్యసభ ఎంపీగా వైసీపీ ఎంపీ
X
రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైసీపీ ఎంపీలు నిన్ననే ప్రమాణం చేశారు. అధికారికంగా దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన 51మంది ఎంపీలుగా నమోదయ్యారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో సమీకరణాలు మారిపోయాయి. రాజ్యసభ ఎన్నికల్లో వీరు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం.. వైసీపీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామి రెడ్డి దేశంలోనే రాజ్యసభలో రెండవ అత్యంత ధనవంతుడిగా అవతరించారు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం.. వైసీపీ ఎంపి అయోధ్య రామి రెడ్డి 2577 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించి.. దేశంలోని రాజ్యసభ ఎంపీల్లో రెండో అత్యంత ధనవంతుడిగా మారాడు. బీహార్ నుంచి జనతాదళ్ (యునైటెడ్) ఎంపి మహేంద్ర ప్రసాద్ రూ .4078 కోట్ల ఆస్తులను ప్రకటించి దేశంలోనే అంత్యంత ధనవంతుడైన మొదటి ఎంపీగా రికార్డ్ సృష్టించారు. ఇక సమాజ్ వాదీ పార్టీకి చెందిన జయ బచ్చన్‌కు 1001 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.ఆమె మూడో స్థానంలో ఉన్నారు.

వైసీపీ ఎంపి అయోధ్య రామి రెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన ఒక పారిశ్రామికవేత్త. రూ .2518 కోట్ల ఆస్తులలో ఎక్కువ భాగం కంపెనీ బాండ్లు మరియు షేర్లలో ఉన్నాయి.

మరో వైసీపీ ఎంపి నాథ్వానీ పరిమళ్ రూ.605 కోట్ల ఆస్తులను ప్రకటించారు. మొత్తం 229 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీలను సర్వే చేసిన సంస్థ 203 మంది కోటీశ్వరులేనని తెలిపింది. మొత్తం ఎంపీల్లో కోటీశ్వరులు దాదాపు 89 శాతం అని వివరించింది.

ఇక 229 రాజ్యసభ ఎంపీలలో 54 మంది తమపై క్రిమినల్ కేసులు ప్రకటించారు. 24 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులున్నాయని తెలిపారు. 28 మంది ఎంపీలు తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన ఒక ఎంపీ భోంస్లే శ్రీమంత్ ప్రతాప్ సింగ్ మహారాజ్ (బిజెపి) తనపై హత్యకు సంబంధించిన కేసులను ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్) అత్యాచారానికి సంబంధించిన కేసును ప్రకటించారు.

పార్టీల వారీగా చూస్తే.. బీజేపీకి చెందిన 77 మంది రాజ్యసభ ఎంపీలలో 14 మంది, కాంగ్రెస్ నుంచి 40 రాజ్యసభ ఎంపీలలో 8 మంది, ఏఐటిసి నుండి 13 మందిలో ఇద్దరు, బిజెడి నుండి 9 మంది ఎంపిలలో ముగ్గురు, వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఆరుగురు ఎంపీలలో ముగ్గురికి తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. ఎస్పీ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలలో ఇద్దరు తమపై క్రిమినల్ కేసులు ప్రకటించారు.