Begin typing your search above and press return to search.
వైసీపీ ఎంపీ కారులో దొంగతనం.. కీలక పత్రాలు, కార్డులు అపహరణ
By: Tupaki Desk | 2 Jun 2022 1:30 PM GMTఒక రాష్ట్రానికి ప్రజాప్రతినిధి.. పైగా అధికార పార్టీ నుంచి ఉన్న ఎంపీ.. ఆయనను దొంగలు వదలలేదు. దొంగల దెబ్బకు ఏకంగా సర్వం కోల్పోయారు. అధికార వైసీపీ ఎంపీ పోలీస్ స్టేషన్ గడపతొక్కాడు. ఇదే ఇప్పుడు సంచలనమైంది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కారులో దొంగతనం జరిగింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రబోసుకు సంబంధించిన రాజ్యసభ గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, ఏటీఎం కార్డును గుర్తు తెలియని దుండగులు అపహరించుకు వెళ్లారు. దీంతో ఆయన ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత నెల 25వ తేదీన ద్రాక్షారామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నాయకుడు కొమ్మిశెట్టి వీర్రాజు ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అదే సమయంలో కార్ డోర్స్ లాక్ చేయని కారణంగా కారులో ఉన్న పర్సు అపహరణకు గురైనట్లు ఎంపీ వ్యక్తిగత సిబ్బంది గుర్తించారు.
పర్సులో రాజ్యసభ గుర్తింపు, హెల్త్ , ఏటీఎం కార్డ్స్ ఉన్నాయంటూ ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు బోస్. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఇప్పటికే కర్నూలు వైసీపీ ఎంపీ కూడా ఇలానే మోసపోయాడు. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ సైబర్ నేరగాడి వలలో పడి నిండా మునిగారు. ఆ నేరగాడు చెప్పినట్లు చేసి దారుణంగా మోసపోయాడు. ఇదిప్పుడు సంచలనమైంది.మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయ్యిందని.. వెంటనే పాన్ నంబర్ తో జత చేసి అప్ డేట్ చేసుకోవాలంటూ సోమవారం ఓ మొబైల్ నంబర్ నుంచి ఎంపీ సంజీవ్ కుమార్ సెల్ ఫోన్ కు ఒక మెసేజ్ తోపాటు ఒక లింక్ కూడా వచ్చింది.
దీన్ని నమ్మిన ఎంపీ సంజీవ్.. ఆ లింకులో వివరాలను నమోదు చేసి పంపాడు. ఓటీపీ నంబర్లు వస్తే అవి కూడా సైబర్ నేరగాళ్లకు చెప్పాడు.ఆ వివరాలన్నీ చెప్పిన వెంటనే ఎంపీ సంజీవ్ కుమార్ బ్యాంకు ఖాతా నుంచి రూ.48700 ఒకసారి, రూ.48999 మరోసారి డ్రా అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ లు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన ఎంపీ బ్యాంకుకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది.
ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ను ఏకంగా పట్టపగలు దొంగలు నిలువుదోపిడీ చేశారు. ఎంపీలకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.