Begin typing your search above and press return to search.
వైసీపీ ఎంపీ జోరు చేస్తున్నారు... మ్యాటరేంటి... ?
By: Tupaki Desk | 19 Dec 2021 11:32 AM GMTవైసీపీ ఎంపీలు అసలు మాట్లాడరు, పార్లమెంట్ లో నోరు మెదపరు. వారు అంతా ఉత్సవ విగ్రహాలే అంటూ ఒక వైపు విపక్షాలు ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. మరో వైపు స్టీల్ ప్లాంట్ మీద పార్లమెంట్ లో ప్ల కార్డులు పట్టుకుని ఎందుకు నిలబడరు అని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ గా అడుగుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే విశాఖకు చెందిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ మధ్య ఒక్క సారిగా స్పీడ్ పెంచేశారు. ఆయన వరసబెట్టి విశాఖ సమస్యల మీద అనేక ప్రశ్నలను పార్లమెంట్ లో వేస్తున్నారు.
అంతే కాదు, ఉక్కు మంత్రిని కూడా ఇటీవల విశాఖకు చెందిన కార్మిక ప్రతినిధులతో కలసి వినతిపత్రం ఇప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అని కూడా ఉక్కు మంత్రిని ఎంవీవీ గట్టిగా కోరారు. అదే విధంగా రైల్వే జోన్ విషయంలో కూడా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ వంటి మెగా సిటీకి పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లను మంజూరు చేయాలని ఆయన సంబంధిత శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.
మొత్తానికి సగం కాలం పూర్తి అయ్యాయ ఎంవీవీ జోరు పెంచేశారు. దీని వెనక కారణాలు ఏంటి అంటే చాలానే ఉన్నాయని టాక్ నడుస్తోంది. విశాఖ ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ విజయం జాక్ పాట్ మాత్రమేనని ప్రతిపక్షాల మాటే కాదు, సొంత పార్టీలో కూడా అదే భావన ఉంది. అసలు ఆయన వైసీపీలో ఇలా చేరి అలా టికెట్ పట్టేశారు అని కూడా చెబుతారు.
జగన్ తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రంలో ఉండగా అక్కడే పార్టీలో చేరిపోయిన ఎంవీవీ గట్టిగా పది నెలలు తిరగకుండానే ఎంపీ టికెట్ విశాఖ వంటి చోట దక్కించుకుని అదే ఊపులో ఎంపీ అయిపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయడం ఎంవీవీకే బాగా కలసివచ్చింది. చివరి రౌండ్ లో కేవలం మూడు వేల ఓట్లతో ఆయన నెగ్గి పవర్ ప్రతిష్టాత్మకమైన విశాఖ సీటుకు ఎంపీ అనిపించేసుకున్నారు. తొలిసారి రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడంతోనే ఇలా పార్లమెంట్ లో అడుగుపెట్టడం అంటే అది ఆయనకే చెల్లింది అనాలి.
అయితే ఈసారి ఆయనకు టికెట్ రావడం కష్టమని అంటున్నారు. ఆయన ఎంతసేపూ సొంత బిజినెస్ వ్యవహారాలనే చూసుకుంటూ పార్టీని పక్కన పెట్టారన్న నివేదికలు ఏవో హై కమాండ్ దగ్గర ఉన్నాయట. అంతే కాదు, ఈసారి రాజకీయ సామాజిక సమీకరణలు కూడా ఎంపీ సీటు ఎంపికలో పనిచేస్తాయని అంటున్నారు. లోకల్ క్యాండిడేట్ కే టికెట్ ఇవ్వాలని కూడా ఆలోచన ఉంది. అది కూడా బలమైన సామాజికవర్గానికే అంటున్నారు.
దాంతో ఎంవీవీ తన జోరుని పెంచారు అని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ సీటు వైసీపీకి దక్కడం కూడా కష్టమనే భావన ఉంది. జనసేన టీడీపీ బీజేపీ కలసి కూటమిగా వస్తే కచ్చితంగా ఆ సీటుని వారే ఎగరేసుకుపోవడం ఖాయమని అంటున్నారు. దాంతో సామాజిక సమీకరణలను వైసీపీ నమ్ముకుంటుంది అన్న మాట ఉంది. దాంతో అటు పార్టీ దృష్టిలో పడడంతో పాటు ఒకవేళ పార్టీ హ్యాండ్ ఇస్తే వేరే మార్గాల ద్వారా అయినా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించేందుకే ఎంవీవీ అటు పార్లమెంట్ లోనూ ఇటు జనంలోనూ తరచూ కనిపిస్తున్నారు అన్న మాట అయితే ఉంది. మొత్తానికి వైసీపీ ఎంపీలు ఎవరూ సభలో మాట్లాడరు అన్న విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపధ్యంలో ఎంవీవీ కాస్తా చురుకు చేయడం అంటే పార్టీకి కూడా అది ప్లస్ గానే చూడాలేమో.