Begin typing your search above and press return to search.
బీసీ బాణంతో మోడీని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ
By: Tupaki Desk | 18 Jan 2023 3:30 AM GMTబీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ కృష్ణయ్య కు ఏరి కోరి మరీ రాజ్యసభకు జగన్ పంపించారు. ఆయన వల్ల బీసీ ఓటు బ్యాంక్ టోటల్ గా తమ వైపు ఉంటుందని. అలా తమకే అతి పెద్ద వాటా దక్కుతుందని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే ఆర్ క్రిష్ణయ్య ఇపుడు బీజేపీ మోడీతోనే సమరం అంటున్నారు. కేంద్రంలో మోడీతో జగన్ సున్నితంగా సంబంధాలను నెరపుతున్నారు.
కేంద్రాన్ని ఏమీ అనకుండా ఆయన నెట్టుకువస్తున్నారు. వైసీపీకి మొత్తం 31 మంది ఎంపీలు రెండు సభల్లోనూ ఉన్నా రెబెల్ ఎంపీ రఘురమ తప్ప అంతా ఆయన మాట వింటారు. ఆ విధంగా జగన్ మోడీ మధ్య మంచి రిలేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఆ బంధాన్ని బ్రేక్ చేసేలా ఆర్ క్రిష్ణయ్య బీసీ బాణాన్ని మోడీ మీదకు గురి పెట్టారు.
బీసీ అయిన మోడీ దేశానికి ప్రధాని అయినా బీసీల బతుకులు మారలేదని, వారు ఎప్పటికీ పల్లకీ మోసే వారుగానే ఉంటున్నారు అని మండిపడ్డారు. బీసీల బతుకులు చితికిపోతున్న మోడీకి పట్టడంలేదు అని అని నిప్పులు చెరిగారు. జనాభా ప్రాతిపదికన దేశంలోని బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో మోడీ మాత్రం మాట్లాడంలేదు అని అంటున్నారు.
దేశంలో బీసీ జనాభా ఎంత ఉంది అన్న దాని మీద కుల గణన చేపట్టాలని కోరినా కూడా మోడీ ప్రభుత్వం కిమ్మనడంలేదు అని ఆయన ఫైర్ అయ్యారు. బీసీల మీద కేంద్ర ప్రభు ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు ఇది నిదర్శనం అని ఆయన అంటున్నారు. అగ్ర కులాల వారు ఎలాంటి డిమాండ్లు చేయకపోయినా వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించిన మోడీ ప్రభుత్వం జనాభాను ఆధారంగా చేసుకుని బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు పెంచదని ఆయన నిలదీస్తున్నారు.
ఇలా ప్రధాన డిమాండ్లతో ఫిబ్రవరి 8,9 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ఆర్ క్రిష్ణయ్య ప్రకటించారు. బీసీలను ఓట్ల యంత్రాలుగా చూస్తే ఊరుకోమని అంటున్నారు. తమ డిమాండ్లు అప్పటికీ పరిష్కారం కాకపోతే ఏకంగా పార్లమెంట్ ముట్టడికే తాము పిలుపు ఇస్తామని అంటున్నారు. మొత్తానికి మోడీ తో ఢీ అని క్రిష్ణయ్య అంటూంటే అది జగన్ కి వైసీపీకి ఎంతవరకూ ఇబ్బందికరంగా ఉంటుందో అన్న చర్చ సాగుతోంది.
బీసీ కుల గణన మీద వైసీపీ డిమాండ్ చేస్తోంది. కానీ ప్రత్యక్ష పోరాటానికి ఆర్ క్రిష్ణయ్య దిగితే మాత్రం మోడీ సర్కార్ కన్నెర్ర చేస్తుంది. అపుడు జాతీయ స్థాయిలో పరిణామాలు మారుతాయి, ఏపీలో కూడా వైసీపీ బీజేపీల మధ్య సమీకరణల్లో తేడాలు వస్తాయని అంటున్నారు. సో ఆర్ క్రిష్ణయ్య పోరాటం ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.