Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం .. వైసీపీ ఎంపీ సంచలనం పోస్ట్

By:  Tupaki Desk   |   23 Aug 2021 11:30 AM GMT
అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం .. వైసీపీ ఎంపీ సంచలనం పోస్ట్
X
మాకు జనవరి 26 రిపబ్లిక్ డే .. ఆగస్ట్ 15 స్వతంత్య్ర దినోత్సవం .. అక్టోబర్ 2 గాంధీ జయంతి తెలుసు కానీ , ఈ అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం గురించి మాకు తెలియదే అని అనుకుంటున్నారా? వెన్నుపోటు అంటూ.. సైరా పంచ్ పేరుతో షాకింగ్ కామెంట్స్ చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి. ఆగస్టు 23.. అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం, 23-08-1995 ఎన్టీఆర్ సీఎం కుర్చీ లాక్కుని పార్టీ నుంచి బహిష్కరించారంటూ ఓ ఫోటోను ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్ ముందు నిలబడి ఉంటే ఆ వెనుక వైపు చంద్రబాబు ఉన్నారు. ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు అంటూ విజయ సాయి రెడ్డి ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన తరువాత దేశవ్యాప్తంగా వెన్నుపోటు రాజకీయాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు వెన్నుపోటు రాజకీయాల మీద రచ్చ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే అనేక సందర్భాలలో చంద్రబాబు వెన్నుపోటు గురించి ప్రస్తావించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరూ ఊహించని విధంగా అనేక నాటకీయ పరిణామాల మధ్య నాడు ఎన్టీఆర్ సీఎం కుర్చీని పోగొట్టుకోవడం, పార్టీతో పాటు అధికార పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లడం జరిగి నేటికీ 26 సంవత్సరాలు.

ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ మామ ఎన్టీఆర్ వెనుక కత్తి చేతిలో పట్టుకుని నిలుచున్న చంద్రబాబు నాయుడు ఫోటో ను పోస్ట్ చేసి ఆసక్తికర చర్చకు కారణమయ్యారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి ఖతం చేసాడు అశోక్ గజపతి రాజు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ నుండి ఎన్టీఆర్ ను గెంటేసిన వారిలో అశోకగజపతి రాజు ఒకరని , ఎన్టీఆర్ ని గెంటేసిన వారిలో మొదటి పేరు చంద్రబాబు అయితే రెండో పేరు అశోక్ గజపతిదని విమర్శించారు. చంద్రబాబు పై సాయి రెడ్డి ఒక్కడే కాదు ,కొడాలి నాని చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని, పదేపదే ఎన్టీఆర్ ను టార్గెట్ చేసేవారు. ఇక కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన రాంగోపాల్ వర్మ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీసిన విషయం కూడా తెలిసిందే.

నేటికీ చంద్రబాబును వెన్నుపోటు రాజకీయాలపై టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు ఆగస్టు నెల మాత్రం మర్చిపోరు. ఆగస్టు నెల వచ్చిందంటే చాలు బాబు వెన్నుపోటు రాజకీయాలు ప్రధానంగా ఫోకస్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నే ఉన్నారు. అంతర్జాతీయ వెన్నుపోటు దారుల సంఘం అధ్యక్షుడు చంద్రబాబు అంటూ నేటికీ విమర్శిస్తున్న తీరు అందుకు నిదర్శనం. టిడిపి నేతలు ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాన్ని ప్రస్తావిస్తున్నారు. వెన్నుపోటుకు శ్రీకారం చుట్టి నేటికి 26 ఏళ్లని , ఆగస్టు 23వ తేదీన కుట్ర మొదలైందని, ఇప్పుడు 23 వ తేదీన 23 సీట్లతోనే టిడిపి మిగిలిపోయిందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం అవుతోంది.

నారా లోకేష్‌‌పైనా విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. దిశ యాప్‌పై ‌ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందితే పొందావు.. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు మాలోకం అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. యాప్ తో రక్షణ పొందిన వారి పేర్లు పోలీసు విభాగం దగ్గర దొరుకుతాయి. అడిగి తెలుసుకో అన్నారు.