Begin typing your search above and press return to search.
విజయసాయిపై ఏపీ ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా..ఆశ్చర్యపోయే ట్విస్ట్
By: Tupaki Desk | 3 April 2018 5:08 PM GMTతెలుగుదేశం పార్టీకి ఇటీవలి కాలంలో కొరకరాని కొయ్యగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టిన ఉదంతం వైసీపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. వైసీపీ ముఖ్యనేతపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిన తీరు బట్టబయలు అయిన నేపథ్యంలో ఏపీ సర్కారు తీరుపై పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి ప్రత్యేక హోదా గళం వినిపించిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఇటీవలి కాలంలో మారిన పరిస్థితుల వల్ల అధికార టీడీపీ సైతం అదే జపం చేస్తోంది. అయితే టీడీపీ ప్రత్యేక పోరు వెనుక మర్మం, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి బహిరంగంగానే ఎండగడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిపై ప్రత్యేక ఫోకస్‌ను ఏపీ ప్రభుత్వం పెట్టినట్లు ప్రచాచరం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేసేలా తాజాగా విజయసాయిరెడ్డి నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో ఇంటెలిజెన్స్ పోలీస్ ప్రత్యక్షమయ్యారు. తనను తాను ఓ మీడియా సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకొని ఈ విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి చెప్పిన అంశాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన్ను విజయసాయిరెడ్డి గుర్తుపట్టారు.
`మీరు ఇంటెలిజెన్స్ అధికారి అని గుర్తుపట్టాను. ఇది విలేకరుల సమావేశం. ఇక్కడ మీకు పనేం లేదు. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలుంటే నన్ను బయట సంప్రదించండి. మీ ప్రతి అభిప్రాయాన్ని గౌరవించి వాటికి స్పందిస్తాను. మీరు దయచేసిన వెళ్లిపోవచ్చు` అంటూ విజయసాయిరెడ్డి హుందాగా స్పందించారు. దీంతో ఆ వ్యక్తి వాడిన మొహంతో ఆ విలేకరుల సమావేశం గదిని విడిచివెళ్లిపోయారు.