Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేల కొనుగోలుదారులకు ఊరట.. రోహిత్ రెడ్డికి చుక్కెదురు..
By: Tupaki Desk | 28 Dec 2022 12:01 PM GMTబీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ కేసీఆర్ సర్కార్ కు షాకిచ్చిన హైకోర్టు అదే సమయంలో ఈ కొనుగోలు కేసులో బాధితుడిగా ఉన్న బీఆర్ఎస్ రోహిత్ రెడ్డికి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈనెల 30న హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది.
ఈడీ కేసు కొట్టివేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై జస్టిస్ కే.లక్ష్మణ విచారణ చేపట్టారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తరుఫున వైసీపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. పార్టీ మారాలని రోహిత్ రెడ్డికి వందకోట్లు ఆఫర్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆఫర్ మాత్రమే ఇచ్చారని.. డబ్బు ఇవ్వలేదన్న వాదనలు వినిపించారు. ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదన్నారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని వాదించారు.
వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందన్న రోహిత్ రెడ్డి వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది. మంగళవారం రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే రోహిత్ ను రెండు రోజుల పాటు ప్రశ్నించారు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని పిలిచారు. కానీ ఆయన విచారణకు వెళ్లలేదు.
ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలా లేక సుప్రీంకోర్టుకు వెళ్లాలా ప్రభుత్వం నిర్ణయించలేదు.
బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపింది అని.. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను రంగంలోకి దింపి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తాను మాత్రం తగ్గేది లేదని పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.