Begin typing your search above and press return to search.

వైసీపీలో ఆ 'మూడు' పై ఊగిస‌లాట‌.. ఎందుకంటే..!

By:  Tupaki Desk   |   21 May 2022 2:30 AM GMT
వైసీపీలో ఆ మూడు పై ఊగిస‌లాట‌.. ఎందుకంటే..!
X
ఏపీ అధికార పార్టీలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అవే.. విజ‌య‌వాడ‌, గుం టూరు, శ్రీకాకుళం.. పార్ల‌మెంటు స్థానాలు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ వోడిపోయింది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ మూడు చోట్ల కూడా ప‌ట్టు బిగించాల‌ని పార్టీ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ వైసీపీకి ఎంపీస్థాయి నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌.. పీవీపీ.. పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ప్ర‌స్తుతం వ్యాపారాల్లోనే ఆయ‌న మునిగిపోయారు. దీంతో ఇక్క‌డ నుంచి బ‌ల‌మైన నాయ‌కుడిని రంగంలో కి దింపాల‌ని.. పార్టీ నేత‌లు భావిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పార్టీలోకి వ‌స్తార‌ని.. ఆయ‌న‌కు ఈ టికెట్ రిజ‌ర్వ్ చేశార‌ని.. కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తున్నా.. దీనిపై అటు ల‌గ‌డ‌పాటి కానీ, ఇటు వైసీపీ కానీ.. క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో ఇక్క‌డ నుంచి ఎవ‌రు రంగంలోకిదిగుతార‌నేది ఆస‌క్తిగా మారింది. దీంతో ఈ విష‌యం ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్గా మారింది.

ఇక‌, గుంటూరు విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున మోదుగుల వేణుగోపాల్ పోటీ చేసి ఓడిపో యారు. త‌ర్వాత‌.. కొన్నాళ్లు యాక్టివ్‌గానే ఉన్నా.. ఆయ‌న ఇప్పుడు పార్టీకి దూరం మెయింట‌న్ చేస్తున్నారు.

పైగా.. ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు గుంటూ రు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. త‌నకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. ఆయ‌న భావిస్తున్నారు. దీంతో ఇక్క‌డ కూడా.. నేత‌ను వెతుక్కోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

ఇక‌, శ్రీకాకుళం విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఇక్క‌డ ఆయ‌న యాక్టివ్‌గానేఉన్న‌ప్ప‌టికీ.. పార్ల‌మెంటు కంటే.. త‌న‌కు అసెంబ్లీనే బెట‌ర్ అని భావిస్తున్నారు. ఇదిలా వుంటే.. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి.. ఈ సీటుపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని అంటున్నారు.

ఇటీవ‌ల రాజ్య‌స‌భ రేసులో ఆమె పేరు వినిపించింది. అయితే..తాను లోక్‌స‌భ‌కే వెళ్తాన‌ని.. ఆమె చెప్ప‌డంతో.. ఆమెను ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. మొత్తానికి ఇక్క‌డ నాయ‌కులు ఉన్నా.. క్లారిటీ రావాల్సి ఉంది.