Begin typing your search above and press return to search.
మరింత వేడెక్కనున్న ఏపీ అసెంబ్లీ.. రీజన్ ఇదే!
By: Tupaki Desk | 19 Sep 2022 4:59 PM GMTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఇరుకున పెట్టేలా.. వ్యవహరిస్తున్న అధికార పార్టీ వైసీపీ.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని, పోలవరం, రైతుల అంశాలతో గత టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. సీంఎ జగన్ నుంచి నాయకుల వరకు అందరూ.. గత సర్కారును టార్గెట్ చేస్తూ.. విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు.. ఏకంగా.. మరింత ఇబ్బందిలోకి నెట్టేలా.. టీడీపీని ఇరుకున పెట్టాలా.. `డేటా చౌర్యం` అంశాన్ని సభలో ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని తాలూకు ఇప్పటికే సర్కారుకు అందిన నివేదికను వచ్చే రెండు రోజుల్లోనే సభలో ప్రవేశ పెట్టి టీడీపీపై మరిన్ని విమర్శలు గుప్పించే అవకాశం ఉందని సమాచారం.
డేటా చౌర్యంపై ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కూడిన కమిటీని .. గత అసెంబ్లీ సమావేశాల్లోనే నియమిం చారు. ఈ క్రమంలో భూమన పలుమార్లు దీనిపై విచారణ కూడా జరిపారు. దఅనంతరం.. దీనికి సంబంధించి ఆయన రూపొందిం చిన నివేదకను ప్రభుత్వానికి కొన్నాళ్ల కిందటే అందించారు. తాజాగా దీనిని సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని అడ్డు పెట్టుకుని టీడీపీపై మరింత రెచ్చిపోయే ఛాన్స్ వైసీపీ తీసుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఏం జరిగింది?
గత ప్రభుత్వ హాయంలో పౌరుల వ్యక్తిగత డేటా చోరీ జరిగిందంటూ నాడు విపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమకు ఓటు వేయని వారిని గుర్తించి వారికి ఓటు లేకుండా చేయటమే దీని వెనుక ఉద్దేశమని ఆరోపించింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమచారం. .ప్రైవేటు వ్యక్తుల వద్దకు చేర్చారని విమర్శించారు. ఇదే అంశం పైన కొద్ది నెలల క్రితం అసెంబ్లీ వేదికగా చర్చ సాగింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ వద్దకు పెగాసస్ అమ్ముతామని వచ్చారని, తాను తిరస్కరించగా ..అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కొనుగోలు చేసారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీకి అస్త్రంగా మారాయి. వీటి ఆధారంగా అసెంబ్లీలో చర్చకు నిర్ణయించింది. అదే సమయంలో టీడీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో ఎటువంటి స్పై వేర్ కొనుగోలు చేయలేదని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సమయంలో టీడీపీ ప్రభుత్వంలో నిఘా చీఫ్ ఉన్న అధికారి.. టీడీపీలోని ముఖ్య నేతల సన్నిహితులు కలిసి ఇదంతా చేసారని సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
దీని పైన నాటి నిఘా చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే స్పందించారు అసలు ఎటువంటి స్పై వేర్ కొనుగోలు చేయలేదని చెప్పుకొచ్చారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత డీజీపీగా నియమితులైన గౌతం సవాంగ్ ఇదే విషయాన్ని స్పష్టం చేసారని గుర్తు చేసారు. అయితే.. అదే రోజు సభలో వైసీపీ సభ్యుల సూచన మేరకు టీడీపీ హయాంలో ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సభా సంఘం వేసి విచారణ చేయాలని నిర్ణయిస్తూ స్పీకర్ ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో కమిటీ వేసారు. ఈ కమిటీలో సభ్యులుగా పార్థసారధి, అబ్బయ్య చౌదరి,మొండితోక జగన్మోహన్ రావు, జక్కంపూడి రాజా ఉన్నారు. అందులో గోప్యంగా ఉండాల్సిన సమాచారంతో పాటు పోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చిన ఈ కమిటీ 85 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించింది.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
మంగళవారం జరిగే అసెంబ్లీలో ఈ నివేదికను సమర్పించనున్నారు. గోప్యంగా ఉంచాల్సిన సమాచారం బయటకు వెళ్లటం.. ఫోన్ ట్యాపింగ్ పైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. దీంతో..ఈ నివేదికలో సభా సంఘం తేల్చిన అంశాలు..ఎవరిని ఇందుకు బాధ్యులను చేస్తూ సిఫార్సు చేసారనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లుగా కమిటీ నిర్దారణకు వచ్చిందని సమాచారం. ఇక, ఈ క్రమంలోనే టీడీపీపై వైసీపీ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.