Begin typing your search above and press return to search.
విశాఖ రాజధాని ...నోరెందుకు విప్పడంలేదు...?
By: Tupaki Desk | 24 Oct 2022 11:43 AM GMTఉత్తరాంధ్రా బాగా వెనకబాటుతనంతో ఉన్నదని, ఈ విషయంలో అంతా ఆలోచించి ఉత్తరాంధ్రాలో రాజధానికి మద్దతు ఇవ్వాలని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరుతున్నారు. విశాఖను రాజధానిగా చేయమని ప్రజలు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ఇటీవల గట్టిగానే అడుగుతున్నారు. నిజానికి ఈ విషయంలో ధర్మానది ఆవేదనాపూరితమైన వాదంగా కనిపిస్తోంది.
విశాఖ రాజధాని అంటూ ఎంత హైప్ చేసినా జనాల నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు రాకపోవడం పట్ల ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలు కాసింత నిరాశగా ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. ఈ అవకాశం ఇపుడు కాకపోతే మరెప్పుడూ రాదు, దీన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పదే పదే కోరుతున్నారు. విశాఖ రాజధాని అయితే మూడు జిల్లాలూ అభివృద్ధి చెందుతాయని, అదే విధంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని అందువల్ల యువత విశాఖ రాజధాని కోసం గొంతెత్తి నినదించాలని ఆయన పిలుపు ఇస్తున్నారు.
ఈ మధ్య మంత్రుల టోన్ లో మార్పు వస్తోంది. తాము ఎంతలా డిమాండ్ చేస్తున్నా గొంతు పెంచుతున్నా జనాల నుంచి ఎందుకు తగిన విధంగా రియాక్షన్ రావడం లేదు అన్నదే వారి బాధగా కనిపిస్తోంది అని అంటున్నారు. ధర్మాన వంటి వారు అయితే తాము మంత్రిగా ఉండడం వల్ల కొంత పరిధి దాటి మాట్లాడలేకపోతున్నామని, ఇది సరైన తరుణమని పదవులకు రాజీనామా చేసి జనాల్లోకి వెళ్ళి వారిని చైతన్యం చేయడం తనలాంటి ఆరు పదులు వయసు దాటిన సీనియర్ సిటిజన్ బాధ్యత అని కూడా అన్నారు.
తనకు మంత్రి పదవుల మీద ఆశ కంటే ఉత్తరాంధ్రా జిల్లాల మీద అపేక్ష ఎక్కువని, అందుకే తాను రాజీనామాకు రెడీ అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా వాసులు పెదవి ఎందుకు విప్పడంలేదు అని మౌలికమైన ప్రశ్ననే రైజ్ చేస్తున్నారు. మీరు రాజధానిని ఎందుకు గట్టిగా కోరడం లేదు అని ఆయన అంటున్నారు. ఈ విషయంలో ప్రజలకు ఎందుకు అంత కష్టంగా ఉందో తనకు అర్ధం కావడం లేదు అని కూడా ఆయన అంటున్నారు.
ఉత్తరాంధ్రా జిల్లాలకు ఆశాకిరణంగా విశాఖను రాజధానిని చేస్తమనై చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ కి ఎందుకు జనాలు జై అని అనడం లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందా అని ఆయన సూటిగానే అడుగుతున్నారు. ఒక వేళ తాము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి కూడా రెడీ అని ఆయన అంటున్నారు. చివరికి విశాఖ రాజధానిగా కావాలా వద్దా అన్నది యువతే ఆలోచించుకోవాలని కూడా ధర్మాన చెప్పుకొచ్చారు.
అదే విధంగా అమరావతిలో లక్షలాది రూపాయాలతో రాజధాని నిర్మించాలి అంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని, అదే విశాఖలో రాజధాని అంటే జస్ట్ పదిహేను వందల కోట్ల రూపాయలతో పూర్తి చేసుకోవచ్చు అని ఆయన అంటున్నారు. రెడీ మేడ్ సిటీగా విశాఖ ఉండడం వల్లనే ఇది సాధ్యపడుతుంది అని ఆయన అంటున్నారు.
ఇదిలా ఉండగా విశాఖవాసులు రాజధాని గురించి గట్టిగా డిమాండ్ చేయకపోతే రేపటి రోజున ఇతర ప్రాంతాల వారు విశాఖ వచ్చి ఇక్కడ రాజధాని కావాలన్న కోరిక లేదు అని ఎలుగెత్తి చాటితే అది తమకు ఇబ్బంది అవుతుందని వైసీపీ మంత్రులు భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఇతర ప్రాంతాలోని నాయకులను విశాఖ రానీయకుండా అడ్డుకునే వ్యూహానికి తెర తీస్తున్నారు అని అంటున్నారు.
అయితే ఇది చివరికి వైసీపీకే బూమరాంగ్ అవుతుందని, ఇతర ప్రాంతాల వారిని రానీయకుండా అడ్డుకోవాలని చూస్తే వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది అవుతుందని కూడా అంటున్నారు. మొత్తానికి మంత్రుల రాజధాని నినాదం అరణ్య రోదనగా మారుతోందా అంటే జవాబు జనాలే చెప్పాలి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.