Begin typing your search above and press return to search.

అలీకి ఒక్క పదవితో వైసీపీ తేల్చేసే లెక్కలెన్నో...?

By:  Tupaki Desk   |   28 Oct 2022 5:30 PM GMT
అలీకి ఒక్క పదవితో వైసీపీ తేల్చేసే లెక్కలెన్నో...?
X
అలీ అంటే స్టార్ కెమేడియన్. టాలీవుడ్ లో కీలకమైన స్థాయి ఆయనది. హీరోగా అనేక సినిమాలు చేశారు. బాలనటుడిగా రంగం ప్రవేశం చేసి గత నాలుగున్నర దశాబ్దాలుగా తన హవాను కొనసాగిస్తున్నారు. అలీ ప్రస్తుతం ఒక ప్రముఖ టీవీలో షో కి హోస్ట్ చేస్తున్నారు. అలీకి రాజకీయ కోరిక ఉండడం వల్ల టీడీపీలో మొదట చేరి ఇపుడు వైసీపీకి జై కొట్టారు. అలీ 2019 ఎన్నికల్లో వైసీపీకి విస్తృతమైన ప్రచారం చేశారు.

ఆయనకు కాస్తా లేట్ గా అయినా చిన్నదో పెద్దదో ఒక పదవి అయితే ఈరోజుకి దక్కింది. ఒక విధంగా తన మీద జరుగుతున్న పొలిటికల్ ర్యాగింగ్ ని తప్పించుకోవడానికి ఈ పదవి అలీకి అందివచ్చిన అవకాశం. అదే టైం లో అలీకి పదవి ఇవ్వడం ద్వారా వైసీపీ చాలా లెక్కలను తేల్చబోతోంది అని అంటున్నారు.

అలీ పవన్ కళ్యాణ్ కి మంచి మిత్రుడు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బిగ్ ఫైట్ ఉంటుంది. దాంతో వైసీపీ నుంచి సినీ సెలిబ్రిటీస్ తక్కువగా ఉన్నారు. దాంతో అలీని ముందు పెట్టి వైసీపీ పవన్ మీద విమర్శలు చేయించే అవకాశం ఉంది. ఇప్పటికే అలీ 2019 ఎన్నికల వేళ తాను సొంతంగా ఎదిగి ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకున్నారు. అలా పవన్ మీద సెటైర్లు వేశారు. 2024 ఎన్నికల్లో దీనికి నాలుగు రెట్లు రాజకీయ విమర్శలు చేయాల్సి ఉంటుంది. అందుకే అలీని వైసీపీ దగ్గరకు తీస్తోంది అని అంటున్నారు.

ఇలా పవన్ కి చెక్ పెట్టడానికి అలీ పదవి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో సినీ నటులను మరి కొంతమందిని అట్రాక్ట్ చేయడానికి అలీకి పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినీ నటులు చాలా మంది వైసీపీ వైపు వచ్చినా వివిధ కారణాల వల్ల సైలెంట్ అయ్యారు. దాంతో వచ్చే ఎన్నికల్లో పాత వారికి చురుకు పుట్టించడానికి కొత్త వారిని వైసీపీ వైపుగా ఆకర్షించడానికి అలీకి పదవి ఇవ్వడం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

మరో వైపు చూస్తే అలీ పదవి ఏదీ దక్కకపోవడంతో ఆయన కూడా వైసీపీకి గుడ్ బై కొడతారు అని అంతా భావించారు. ఆ దిశగా ప్రచారం కూడా సాగింది. అలీ జనసేనలో చేరుతారు అని కూడా వార్తలు వచ్చాయి. దీనిని కూడా వైసీపీ తీవ్రంగానే పరిగణనలోకి తీసుకుంది అంటున్నారు. అందుకే అలీకి పదవి ముందు ఇచ్చారు అని తెలుస్తోంది.

అయితే ఈ పదవి అలీకి ఇచ్చాక మరింతమంది సినీ ప్రముఖులు వైసీపీ టచ్ లోకి వస్తారా లేదా అన్నది చూడాలి. టాలీవుడ్ లో చూస్తే టీడీపీ జనసేన మద్దతుదారులు ఎక్కువ మంది ఉన్నారని చెబుతారు. దాంతో ఇపుడు తమ వాటా కూడా ఎంతో కొంత తేల్చుకోవడానికే అలీకి పదవి కట్టబెట్టారని అంటున్నారు. మరి ఈ లెక్కలను అలీ సెట్ చేయగలరా. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ స్టార్ కాంపెనియర్ గా సినీ పక్షాన నిలిచి ప్రతిపక్షాలను చెడుగుడు ఆడతారా అంటే వెయిట్ చేసి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.