Begin typing your search above and press return to search.
వైసీపీ ప్లాన్ బి.. సీమకే హైకోర్టా?
By: Tupaki Desk | 28 Sep 2019 5:30 AM GMTతెలంగాణ ఎందుకు ఏర్పడింది. ఆంధ్రా పాలకుల చేతిలో నిధులు - నియామకాలు - నీళ్ల విషయంలో వివక్ష కలిగినందుకే.. అందుకే ఇప్పుడు ఏపీలో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా అధికారంలోకి వచ్చిన వైసీపీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
తాజాగా ఏపీలో హైకోర్టు ఏర్పాటు విషయంలో ఆందోళన మొదలైంది. కర్నూలుకు హైకోర్టును మార్చాలని రాయలసీమ లాయర్లు అంతా సీమలో ఆందోళన మొదలు పెట్టారు. వారికి పోటీగా నెలరోజులుగా గుంటూరు జిల్లాలోని హైకోర్టు న్యాయవాదులంతా ఇక్కడి నుంచి తరలిస్తే బాగోదు అని నిరసనలు తెలుపుతున్నారు. హైకోర్టు విధులను బహిష్కరిస్తున్నారు. ఇక నామమాత్రపు రైల్వే జోన్ ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిని విస్మరించారని.. మాకు ఉత్తరాంధ్రలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత లాయర్లు డిమాండ్ చేస్తున్నారు.
అయితే 1953లో మద్రాస్ నుంచి విడిపోయి కొత్త ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు రాజధానితో పాటు హైకోర్టు కర్నూలులోనే ఏర్పాటు చేశారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అనుసరించి వెనుకబడిన సీమకు దీన్ని కేటాయించారు. ఆ తర్వాత 1956లో తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడగా ఈ హైకోర్టు - రాజధానిని హైదరాబాద్ కు మార్చారు. అయితే 2014లో మళ్లీ విడిపోయిన రాష్ట్రం 1953నాటి ఆంధ్రా రాష్ట్రంగా అప్పటి భూభాగంతోనే ఏర్పడింది. దీంతో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కాకున్నా హైకోర్టును అయినా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని సీమ లాయర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కర్నూలుకే చెందిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాయలసీమకు హైకోర్టును మార్చడం సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నామన్నారు. సీఎం జగన్ ఏపీలోని 13 జిల్లాలకు అభివృద్ధిని విస్తరించడానికి ఆలోచిస్తున్నారని.. అందులో భాగంగానే కర్నూలుకు హైకోర్టు తరలించే విషయంలో సమాలోచనలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.
అయితే హైకోర్టును కర్నూలుకు తరలిస్తే గుంటూరు రాజధాని ప్రాంత న్యాయవాదులు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక ఉత్తరాంద్ర లాయర్ల నుంచి నిరసన సెగ తగులుతుంది. అయితే రాయలసీమ ప్రజలు - లాయర్ల మనసును మాత్రం జగన్ సర్కారు గెలుచుకోవడం ఖాయం.
జగన్ ఆలోచనను బట్టి రాజధాని అమరావతి విజయవాడ-గుంటూరు వాసులకు - హైకోర్టు రాయలసీమకు - ఉత్తరాంధ్రకు కొత్త రైల్వే జోన్ తో మూడు ప్రాంతాలకు న్యాయం చేయడానికి వైసీపీ సర్కారు రెడీ అయినట్లు సమాచారం.