Begin typing your search above and press return to search.

ఢిల్లీలోనూ బాబుకు చుక్క‌లే... వైసీపీ ప్లాన్ మామూలుగా లేదే..!

By:  Tupaki Desk   |   25 Oct 2021 4:05 AM GMT
ఢిల్లీలోనూ బాబుకు చుక్క‌లే... వైసీపీ ప్లాన్ మామూలుగా లేదే..!
X
ఏపీ మాట‌ల యుద్ధం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు పోటా పోటీగా ఏపీలో మాట‌ల యుద్ధం చేసుకున్న విష‌యం తెలిసిందే. నువ్వు విమ‌ర్శిస్తే.. నేను వీధికిలాగుతా! అని.. ఈ రెండు పార్టీలూ ఇక్క‌డ వీధి పోరాటాలు చేసుకున్నాయి. ఇంత‌కీ.. గంజాయి.. తోట‌ల‌కు సంబం ధించిన వివాదంలో మాజీ మంత్రి న‌క్కా ఆనందబాబు చేసిన వ్యాఖ్య‌లతో పుట్టిన వివాదం.. చంద్ర‌బాబు దీక్ష‌ల‌కు వ‌ర‌కు సాగింది. ఇప్పుడు ఢిల్లీకి ఎగ‌బాకుతోంది. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని.. టీడీపీ చెబుతోంది. అంతేకాదు.. గ‌త రెండు న్న‌రేళ్లుగా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమ‌లు జ‌ర‌గ‌డం లేద‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ ఆరోపిస్తున్నారు.

అంతేకాదు.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు పూర్తిగా విఘాతం క‌లుగుతోంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌నే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. అయితే.. దీనికి కేంద్రం అనుమ‌తిస్తుందా? రాష్ట్ర‌ప‌తి అనుమ‌తిస్తాడా..? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు టూర్‌పై ఏదైనా ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని.. వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. అంటే.. చంద్ర‌బాబు వంటి దూర‌దృష్టి ఉన్న నాయ‌కుడు కాబ‌ట్టి.. ఢిల్లీకి వెళ్తే.. ఖచ్చితంగా .. ఇంకేదైనా కూడా ఆయ‌న మేనేజ్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని.. వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కులు కూడా ఢిల్లీ బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీ బృందం ఢిల్లీకి బ‌య‌ల్దేరిన నేప‌థ్యంలో .. వైసీపీ బృందం ఎలాంటి అప్పాయింట్‌మెంట్లు లేక‌పోయినా.. ముంద‌స్తు గా.. ఢిల్లీ ప్ర‌యాణం పెట్టుకోవడం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు రెడీ చేసుకున్న‌ట్టు వైసీపీ నుంచి తెలుస్తోంది. ఢిల్లీలో చంద్ర‌బాబును మ‌రింత డైల్యూట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు విజ‌య‌సాయిరెడ్డి ఇటీవ‌ల చెప్పారు. అదేస‌మ‌యంలో గ‌తంలో అమిత్ షాపై రాళ్లేయించిన ఘ‌ట‌న.. మోడీని తిట్టిపోసిన ఘ‌ట‌న వంటివి వైసీపీ నేత‌లు ప్ర‌యోగిస్తున్నారు.

సో.. ఇటు టీడీపీ.. అటువైసీపీలు ఏపీలో పోటా పోటీగా.. దీక్ష‌లు.. ధ‌ర్నాలు చేసుకున్న వైనం కాద‌ని.. ఇప్పుడు మ‌రింత దూకుడుగా.. ముందుకు సాగి.. వ‌చ్చే ఢిల్లీలోనూ పంచాయ‌తీ పెట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే.. చంద్ర‌బాబు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను.. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని క‌లిసేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. దీనిని వైసీపీ ప్ర‌ముఖంగా చూపించాల‌ని భావిస్తోంది. ఎందుకంటే.. బీజేపీకి.. మ‌మ‌త‌కు, కేజ్రీవాల్‌కు ప‌డదు.. కాబ‌ట్టి.. చంద్ర‌బాబును ఆవిధంగా కూడా డైల్యూట్ చేయాల‌ని చూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏదేమైనా.. ఢిల్లీలో వైసీపీ, టీడీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతాయోన‌నే చ‌ర్చ మాత్రం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.